Priyanka Chopra:ప్రతిరోజూ నువ్వే నాకు స్ఫూర్తి - priyanka chopras husband appreciation post
close
Published : 24/05/2021 17:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Priyanka Chopra:ప్రతిరోజూ నువ్వే నాకు స్ఫూర్తి

 భర్త నిక్ జోనస్‌ని అభినందిస్తూ ప్రియాంకా చోప్రా భావోద్వేగం

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా, హాలీవుడ్‌ గాయకుడు నిక్‌ జోనస్‌ దాంపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెరీర్‌ పరంగానే కాదు, నిత్యం అన్యోన్య దాంపత్య జీవితం కొనసాగిస్తూ వార్తలో నిలుస్తుంటుందీ జంట. తాజాగా వారి మధ్య జరిగిన ఒక సంఘటనను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రాసుకొచ్చిందీ ముద్దుగుమ్మ. ‘‘సోమవారం ఉదయం నిక్‌కు బైక్‌ ప్రమాదం జరిగింది. రిబ్‌ ఫ్రాక్చర్‌ అయినా సరే, గాయాన్ని సైతం పట్టించుకోకుండా.. బిల్లిబోర్డ్‌ మిర్చి అవార్డ్స్‌కు వ్యాఖ్యాతగా చేసేందుకు సిద్ధమయ్యాడు. ‘నిక్‌.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నువ్వు చేసే ప్రతి పని, అందులో విజయం సొంతం చేసుకునేందుకు నువ్వు పరితపించే విధానం..అన్నీ నాలో స్ఫూర్తిని నింపుతున్నాయి. ఐ లవ్‌ యూ సోమచ్‌’ అంటూ భర్తని అభినందిస్తూ రాసుకొచ్చింది. దీనికి నిక్‌ బదులిస్తూ.. ‘ప్రియాంకా.. నేను త్వరగా కోలుకునేందుకు నా పక్కనే ఉండి జాగ్రత్తలు తీసుకున్నావ్‌. ఈ మ్యూజిక్‌ అవార్డ్స్‌ను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను. ఇప్పుడు దీనికే వ్యాఖ్యాతగా వ్యవహరించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తా. ఈ కార్యక్రమంలో నువ్వు నాకు తోడుగా, వ్యాఖ్యాతగా పక్కనే ఉన్నావ్‌.. ఐ లవ్‌ యూ’ అంటూ నిక్‌ తన భార్యకు బదులిచ్చాడు.
 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని