సోనూసూద్‌కి మద్దతుగా ప్రియాంక చోప్రా - priyanka support to sonu sood
close
Updated : 04/05/2021 12:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోనూసూద్‌కి మద్దతుగా ప్రియాంక చోప్రా

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్య అందించాలని నటుడు సోనూసూద్‌ ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో సోనూకి మద్దతుగా నిలిచారు ప్రముఖ నటి ప్రియాంక చోప్రా. ఈ మేరకు సోనూ గొప్పతనాన్ని చాటుతూ ట్వీట్‌ చేశారామె.

‘విజనరీ ఫిలాంత్రపిస్ట్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? నా సహ నటుడు సోనూ సూద్‌ అలాంటి వ్యక్తే. అతని ఆలోచనలు, ప్రణాళికలు అద్భుతంగా ఉంటాయి. కరోనా కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన వారికి ప్రభుత్వాలు ఉచిత విద్య అందించాలన్న ఆయన ఆలోచన గొప్పది. సోనూని చూసి నేను స్ఫూర్తి పొందుతున్నాను. కొవిడ్‌తో తల్లిదండ్రులను పోగొట్టుకున్న చిన్నారుల చదువులు అక్కడితో ఆగిపోకూడదు. ఆర్థిక సమస్యల కారణంగా వారు చదువుకు దూరం అవకూడదు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే చాలామంది విద్యార్థులు నష్టపోతారు. విద్య అనేది ప్రతి ఒక్కరి జన్మహక్కు. విద్యను ప్రోత్సహించేందుకు నేనూ నా వంతు కృషి చేస్తాను’ అని తెలిపారు. దీనిపై స్పందించారు సోనూ. ‘ఈ మిషన్‌కి మీ మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రియాంక. మనందరం కలిస్తే అనుకున్నది సాధ్యమవుతుంది’ అని అన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని