‘స్టేటస్‌కో’పై సోమవారం సుప్రీంలో విచారణ - prob on ap govt pitition on monday
close
Published : 13/08/2020 20:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘స్టేటస్‌కో’పై సోమవారం సుప్రీంలో విచారణ

దిల్లీ: ఏపీ పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ రెండు చట్టాలను సవాల్‌ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కాగా.. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం స్టేటస్‌ కో విధించింది. ప్రస్తుత రాజధాని, సీఆర్‌డీఏను యథాతథంగా కొనసాగించాలని ఆదేశించింది. దీంతో హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కోను ఎత్తివేయాలంటూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. తాజాగా ఈ పిటిషన్‌పై త్వరగా విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు లేఖ కూడా రాసింది. దీంతో ఏపీ సర్కార్‌ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరపనుంది. అదే రోజు అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్‌-5 జోన్లపై దాఖలైన పిటిషన్లను కూడా న్యాయస్థానం విచారించనుంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని