‘కరోనా సోకిన దివ్యాంగుల వివరాలు సేకరించండి’ - prob on disable persons amid corona in ts high court
close
Published : 06/08/2020 22:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కరోనా సోకిన దివ్యాంగుల వివరాలు సేకరించండి’

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌: కరోనా పరిస్థితుల్లో దివ్యాంగులను ఆదుకోవాలన్న పిల్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఈ పిల్‌పై హైకోర్టుకు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య నివేదిక సమర్పించారు. దివ్యాంగుల కోసం రూ. 3.61 కోట్లు కేటాయించినట్లు నివేదికలో పేర్కొన్నారు. కరోనా బారిన పడిన దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కరోనా స్వల్ప లక్షణాలు ఉన్న దివ్యాంగులకు నేచర్‌క్యూర్‌లో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

దీంతో మధ్య, తీవ్ర లక్షణాలు ఉన్న దివ్యాంగుల పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జిల్లాల వారీగా కరోనా సోకిన దివ్యాంగుల వివరాలు సేకరించాలని ఆదేశించింది. కరోనా పరీక్షల పత్రంలో దివ్యాంగుల వివరాల నమోదుకు కాలమ్‌ పెట్టాలని సూచించింది. కరోనా పరీక్ష కేంద్రాల్లో దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దివ్యాంగుల పట్ల శ్రద్ధ వహించేలా వైద్య సిబ్బందికి చైతన్యం కలిగించాలని సూచించింది. ఈ నెల 23లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని