వ్యాక్సిన్‌ కొరత లేదు.. అసలు సమస్య అదే: కేంద్రం - problem not of covid vaccine shortage but of planning
close
Updated : 13/04/2021 19:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాక్సిన్‌ కొరత లేదు.. అసలు సమస్య అదే: కేంద్రం

న్యూదిల్లీ: ఒకవైపు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుంటే, మరోవైపు వ్యాక్సిన్‌ కొరత వేధిస్తోంది. ‘వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు’ అంటూ వివిధ ఆస్పత్రుల వద్ద బోర్డులు దర్శనమిస్తున్నాయి. రాష్ట్రాలు సైతం వ్యాక్సిన్‌ సరఫరాను పెంచాలని కేంద్రానికి లేఖ రాశాయి. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 1.67కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌ల నిల్వ ఉందని తెలిపింది. సమస్య వ్యాక్సిన్‌ కొరత కాదని, సరైన ప్రణాళిక లేకపోవడం అని చురకలంటించింది.

‘‘ఇప్పటివరకూ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు మొత్తం 13.10 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లు సరఫరా చేశాం. వృథాతో కలుపుకొని 11.43 కోట్ల డోస్‌లు వినియోగించారు. ఇంకా 1.67 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు ఉన్నాయి. రోజుకు 41లక్షలకు పైగా వ్యాక్సిన్‌ డోస్‌లను అందిస్తున్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ ఇస్తున్న దేశం మనదే. కరోనాతో బాధపడుతూ ఆక్సిజన్‌ అవసరమైన రోగులకు మాత్రమే రెమ్‌డెసివిర్‌ ఇవ్వాలి. ఎలాంటి లక్షణాలు లేకుండా హోం క్వారంటైన్‌లో ఉన్న వారు దీన్ని వినియోగించవద్దు. ప్రస్తుతానికి రెమ్‌డెసివర్‌ కొరత ఎక్కడా లేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మాత్రమే ఈ మందు ఇవ్వాలని వైద్యులను కోరుతున్నాం.

వ్యాక్సిన్‌ తీసుకుంటే తీవ్రత తగ్గుతుంది

45 సంవత్సరాలు పైబడిన వారందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని, దీని ద్వారా వ్యాధి నియంత్రణ సాధ్యమవుతుందని ఐసీఎంఆర్‌ డీజీ బలరామ్‌ భార్గవ తెలిపారు. రెండు డోస్‌లు తీసుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీస్‌ వృద్ధి చెందిన కరోనాను సమర్థంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుందని తెలిపారు. ఒక వేళ కరోనా బారిన పడ్డా, మరణాల రేటు తక్కువగా ఉంటుందని వివరించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో 85శాతం వరకూ ఆస్పత్రిపాలయ్యే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని