కరోనా: సత్తాగల కొత్త యాంటీబాడీలు గుర్తింపు - promising new antibodies against novel coronavirus found
close
Published : 13/01/2021 19:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా: సత్తాగల కొత్త యాంటీబాడీలు గుర్తింపు

దిల్లీ: ఒంటెజాతికి చెందిన లామాస్‌, అలపకాస్‌ జంతువుల్లో కరోనా వైరస్‌ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోగల యాంటీబాడీలను పరిశోధకులు గుర్తించారు. సంప్రదాయ యాంటీబాడీలతో పోలిస్తే ఇవెంతో సూక్ష్మంగా ఉన్నాయని తెలిపారు. అవి శరీరంలోని కణజాలంతో మెరుగ్గా కలిసిపోయి భారీ స్థాయిలో యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తున్నాయని వెల్లడించారు. జర్మనీలోని బోన్‌ విశ్వవిద్యాలయం నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం సైన్స్‌ జర్నల్‌లో ఈ వివరాలను ప్రచురించింది.

దేహంలోని అనేక భాగాల్లో ఉన్న వైరస్‌పై ఒకేసారి దాడిచేసేలా నానోబాడీలను శాస్త్రవేత్తలు జతచేయడం గమనార్హం. ఇన్ఫెక్షన్‌ సోకినప్పుడు వైరస్‌, బ్యాక్టీరియాతో పోరాడేందుకు శరీరం యాంటీబాడీలను విడుదల చేస్తుంది. దాంతో ఇన్ఫెక్షన్‌ నుంచి బాధితులు విముక్తి పొందుతారు. ప్రస్తుత కరోనా వైరస్‌ టీకాలను కనుగొనడంతో పాటు భారీ యెత్తున యాంటీబాడీలను శరీరంలోకి జొప్పించే పద్ధతిని ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. కాగా మన శరీరం అపరిమితంగా వేర్వేరు యాంటీబాడీలను విడుదల చేసినా అవన్నీ భిన్నమైన లక్షిత కణాలను గుర్తిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అందులో కొన్నింటికి మాత్రమే కరోనాను ఎదుర్కొనే సామర్థ్యం ఉందన్నారు.

‘ముందుగా అలపకాస్‌, లామాస్‌లో కరోనా వైరస్‌ ఉపరితల ప్రొటీన్‌ను చొప్పించాం. ఆ తర్వాత వాటిలోని రోగనిరోధక వ్యవస్థ యాంటీబాడీలను విడుదల చేసింది. సాధారణ యాంటీబాడీలతో పోలిస్తే ఇవెంతో సామాన్యంగా, సూక్ష్మంగా ఉన్నాయి’ అని శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్ని వారాల తర్వాత జంతువుల రక్తనమూనాలను తీసుకొని పరిశీలించారు. ఎక్స్‌రే, మైక్రోస్కోపీ విశ్లేషణలు పూర్తైతే ఆ నానోబాడీలు వైరస్‌ కొమ్ముల ప్రొటీన్‌తో ఎలా అనుసంధానం అవుతున్నాయో తెలుస్తుందని వెల్లడించారు.

ఇవీ చదవండి

అది నిజంగా చైనా టీకానే..!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని