#PSPK27: అప్‌డేట్‌ ఏంటంటే? - pspk 27 film update
close
Published : 02/09/2020 13:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

#PSPK27: అప్‌డేట్‌ ఏంటంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: పుట్టిన రోజు నాడు అభిమానుల కోసం పవన్‌ కల్యాణ్‌ మరో కొత్త సినిమా అప్‌డేట్‌ వచ్చేసింది. ఉదయాన్నే ‘వకీల్‌సాబ్‌’ మోషన్‌ పోస్టర్‌ రాగా, ఇప్పుడు #PSPK27 అప్‌డేట్‌ విడుదల చేశారు. ఈ సినిమా ప్రీ-లుక్‌‌ పోస్టర్‌ను చిత్రబృందం సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసింది. పీరియాడికల్ డ్రామా‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్‌ పాత్రను సూచిస్తూ.. ఈ పోస్టర్‌ను రూపొందించారు. పవన్‌ - క్రిష్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాను ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతమందిస్తున్నారు. రామలక్ష్మణ్‌ ఫైట్‌మాస్టర్లు. సాయిమాధవ్‌ బుర్రా, రాజీవన్‌, శ్రవణ్‌, బెన్‌లాక్‌, జ్ఞానశేఖర్‌ వీఎస్‌ తదితరులు ఈ సినిమా సాంకేతిక బృందంలో పని చేస్తున్నారు. 

‘‘పవన్‌ కల్యాణ్‌ గారు #PSPK27 సినిమా 15 రోజుల చిత్రీకరణలో ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతోంది. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తోంది. ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం. మీరు ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తున్నాను’’

- ట్విటర్‌లో దర్శకుడు క్రిష్‌

ఇదిలా ఉండగా పవన్‌ కథానాయకుడిగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘వకీల్‌సాబ్‌’ తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. హిందీలో ఘన విజయం సాధించిన ‘పింక్‌’ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. తొలుత అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాల్సి ఉంది. అయితే, కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది.

‘వకీల్‌సాబ్‌’ మోషన్‌ పోస్టర్‌ కోసం క్లిక్‌ చేయండి



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని