సంక్రాంతికి రానున్న పవర్‌స్టార్‌ - pspk 27 will release on sankrathi 2022
close
Published : 28/02/2021 14:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్రాంతికి రానున్న పవర్‌స్టార్‌

రిలీజ్‌ డేట్‌ ప్రకటించేశారు..!

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఓ సినిమాని ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. పవన్‌కల్యాణ్‌-క్రిష్‌ కాంబోలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ కథానాయిక. PSPK27గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా షూట్‌ శరవేగంగా జరుగుతోంది. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై ఏఎం రత్నం దీనిని నిర్మిస్తున్నారు. పీరియాడికల్‌ డ్రామాగా రానున్న ఈ చిత్రంలో పవన్‌ వజ్రాల దొంగగా కనిపించనున్నట్లు సమాచారం. మరోవైపు మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని సైతం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇటీవల సదరు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్‌ వద్ద పోటీ భారీగా ఉండనుందని అందరూ చెప్పుకుంటున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని