Cricket News: పుజారా స్ట్రైక్‌రేట్లపై విమర్శలు ‘నాన్‌సెన్స్‌’ - pujara has shown that strike rate in test cricket is absolute nonsense dinesh karthik
close
Published : 18/06/2021 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cricket News: పుజారా స్ట్రైక్‌రేట్లపై విమర్శలు ‘నాన్‌సెన్స్‌’

వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్ కార్తీక్‌

సౌథాంప్టన్‌: టీమ్‌ఇండియా నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా స్ట్రైక్‌రేట్ల గురించి పదేపదే మాట్లాడటం అర్థరహితమని వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. అతడు ఆస్ట్రేలియాలో ఎక్కువ పరుగులు చేయలేకపోయినా.. ఎక్కువ సమయం బ్యాటింగ్‌ చేసి విజయాలు అందించాడని పేర్కొన్నాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు డీకే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

‘స్ట్రైక్‌రేట్లు అర్థరహితం. మీరొకసారి టెస్టు గణాంకాలు పరిశీలిస్తే నాలుగు రోజుల్లోపే ముగుస్తున్న మ్యాచులు 80-82 శాతం ఉంటున్నాయి. అలాంటప్పుడు స్ట్రైక్‌రేట్ల గొడవెందుకు? అతడి సహజ శైలిలో అతడిని ఆడనివ్వండి. టీమ్ఇండియా గెలుస్తున్నంత వరకు ఫర్వాలేదు కదా! కోహ్లీసేన కఠిన పరిస్థితుల్లో టెస్టులు ఆడింది. సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో, ఆస్ట్రేలియాతో ఆసీస్‌లో కష్టపడింది. సిడ్నీ టెస్టును తీసుకుంటే పుజారాకు తగిలిన దెబ్బలకు లెక్కేలేదు’ అని డీకే తెలిపాడు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడుతున్నప్పుడు పుజారా గొప్పదనం గురించి ప్యాట్‌ కమిన్స్‌ తనకు చెప్పాడని దినేశ్ కార్తీక్‌ వివరించాడు. ‘టీమ్‌ఇండియా సిడ్నీ టెస్టు డ్రా చేయడానికి, గబ్బాలో గెలవడానికి ఒకే ఒక్కరు కారణం. అతడే చెతేశ్వర్‌ పుజారా. అతడెంతో సేపు బ్యాటింగ్‌ చేశాడు. దెబ్బలు తగిలించుకున్నాడు. అతడి స్థానంలో మరెవ్వరున్నా ఆసీస్‌ సులభంగా గెలిచేందని కమిన్స్‌ నాతో చెప్పాడు’ అని డీకే అన్నాడు.

టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ సారథులు విరాట్‌ కోహ్లీ, కేన్‌ విలియమ్సన్‌ అగ్ని, మంచులాంటి వారని వివరించాడు. ‘వారిద్దరూ పరస్పరం గౌరవించుకుంటారు.  ఒక ఓవర్లో 32 పరుగులు చేయాల్సినప్పుడూ కేన్‌ ప్రశాంతంగానే ఉంటాడు. విరాట్‌ మాత్రం ఏదైనా అంటే మాత్రం ముఖం మీదే తిరిగి అనకుండా ఉండడు. వారిద్దరిలోని గొప్పదనం అదే. వారిద్దరితో ఆడటమూ బాగుంటుంది. వారిద్దరూ క్రికెట్‌ను ప్రేమిస్తారు.  కాకపోతే భిన్నంగా ఆడతారు. అండర్‌-19 రోజుల్నుంచీ వారిద్దరూ పోటీ పడుతున్నారు. ఆ తరంలోని  కోహ్లీ, స్మిత్‌, రూట్‌, విలియమ్సన్‌ ఒకర్నొకరు చూసి ప్రేరణ పొందుతారు’ అని డీకే అన్నాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని