షూలో క్యాన్సర్‌ వైరస్‌ పెట్టి..! - puri jagannadh about pop singer Bob marley
close
Published : 05/11/2020 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

షూలో క్యాన్సర్‌ వైరస్‌ పెట్టి..!

‘బాబ్‌ మార్లే’ మృతి.. షాకయ్యే నిజాలు

 పూరీ మాటల్లో..

హైదరాబాద్‌: ప్రముఖ గాయకుడు బాబ్‌ మార్లే 36 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో బాధపడుతూ మృతి చెందారు. ఆయన మరణం వెనుక ఉన్న అసలు కారణాన్ని పూరీ తన మాటల్లో చెప్పారు. పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా ‘బాబ్‌ మార్లే’ గురించి మాట్లాడారు.
‘బాబ్‌ మార్లే.. ఫేమస్‌ ఐకాన్‌ ఆఫ్‌ పాప్‌ కల్చర్‌. అతి చిన్న వయసులోనే పాప్‌ స్టార్‌ అయిపోయాడు. అతని పాటలకు ప్రపంచం ఊగిపోయింది. తన పాటలతో ‘న్యాయం కోసం పోరాడండి’ అంటూ లక్షల మంది ప్రజల్లో స్ఫూర్తి నింపడం మొదలుపెట్టాడు. చాలా మందికి అది నచ్చలేదు. ఒక రోజు కొంత మంది ఆయన ఇంటిపై తుపాకులతో దాడి చేశారు. అతడి భార్యను తలపై కాల్చారు. బాబ్‌ భుజంలోకి బుల్లెట్‌ దిగింది. అతడి మేనేజర్‌తోపాటు మరో ముగ్గురు గాయపడ్డారు. ఆ తర్వాత బాబ్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కొన్నాళ్లకు క్యాన్సర్‌ వచ్చి చనిపోయాడు. ఇది అందరికీ తెలిసిన కథ. కానీ ఎవరికీ తెలియని కథ వేరే ఉంది. అది ఈ మధ్యే బయట పడింది. వింటే షాక్‌ అవుతారు’.

‘బిల్‌ ఆక్స్లే అనే వ్యక్తి 80 ఏళ్ల వయసులో చనిపోతూ.. డెత్‌ బెడ్‌పై ఉన్నప్పుడు ఈ రహస్యం బయటపెట్టాడు. అతడు అమెరికన్‌ సీఐఏ ఏజెంట్‌. అమెరికా ప్రభుత్వం బాబ్‌ వల్ల తమకు ప్రమాదం ఏర్పడుతుందని భావించింది. అతడిని చంపమని బిల్‌ని నియమించింది. బాబ్‌ మీద కాల్పులు జరిపింది అతనే. అయితే బాబ్‌ బతికి, దూరంగా వేరే చోటుకు వెళ్లిపోయాడు. అక్కడికి బిల్‌ వెళ్లి, ఓ అభిమానిగా బాబ్‌ని కలిశాడు. నేను మీ అభిమానిని అని చెప్పాడు. షూ బహుమానంగా ఇచ్చాడు. తనే స్వయంగా బాబ్‌ కాళ్లకు తొడిగాడు. షూ వేసుకోగానే కుడివైపు కాలికి ఏదో గుచ్చుకుంది. బాబ్‌ బాధతో అరిచాడు. పొరపాటున ఏదో రాయి పడిందేమో అనుకున్నాడు. కానీ అది కంటికి కనిపించని చిన్న గుండుసూది. క్యాన్సర్‌ వైరస్‌ పూసిన గుండుసూది. ఆ క్షణమే బాబ్‌ జీవితంలో జరగకూడనిది జరిగిపోయింది’.

‘ఆ సమయంలో బాబ్‌ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కొన్నాళ్లకు అతడు చనిపోతాడని బిల్‌కు తెలుసు. అతడు చనిపోయే వరకు వెంటే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఒక అభిమానిగా బాబ్‌తో ఉంటూ.. సేవలు చేసుకుంటూ.. అతడికి మంచి స్నేహితుడు అయిపోయాడు. మెల్లగా బాబ్‌ ఆరోగ్యం క్షీణిస్తుంటే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. క్యాన్సర్‌ ఉందని చెప్పడంతో బాబ్‌ షాక్‌ అయ్యాడు. ‘సర్‌ మీకు మంచి చికిత్స ఇప్పిస్తాను. మీ లాంటి వాళ్లు బతకాలి. నాకు తెలిసిన వైద్యులు ఉన్నారు. ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదు, నేను చూసుకుంటా’నని బిల్‌ నమ్మించి ప్యారిస్‌ తీసుకెళ్లాడు. ప్యారిస్‌లో కొన్నాళ్లు చికిత్స చేశారు. అయినా ఫలితం లేదు. అక్కడి నుంచి లండన్‌ తీసుకెళ్లాడు. అక్కడ కూడా తగ్గలేదు. ఎందుకో తెలుసా.. బిల్ దగ్గరుండి.. చికిత్స జరగకుండా చూస్తున్నాడు’.

‘చివరిగా తనకు పూర్తి కంట్రోల్‌ ఉన్న దేశం అమెరికా తీసుకెళ్లాడు. ఓ ఆసుపత్రిలో ఉంచి, పూర్తిగా అతడికి చికిత్స జరగకుండా చూసుకున్నాడు. అతడి చేతుల్లోనే బాబ్‌ చివరి క్షణాలు గడిచాయి. తన జీవితంలో బిల్‌ లాంటి స్నేహితుడు ఉన్నందుకు ఎంతో ఆనందపడ్డాడు. చివరి వరకు నా వెంట ఉన్నాడని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కృతజ్ఞతాభావంతో బిల్‌ను చూస్తూ.. తుదిశ్వాస విడిచాడు. దేశం కోసం అతడ్ని చంపాడే తప్పా.. బిల్‌కు కూడా బాబ్‌ అంటే చాలా ఇష్టం. అప్పటి వరకు అతను 17 మందిని చంపాడు. కానీ బాబ్‌ను నమ్మించి, మోసం చేయడాన్ని తట్టుకోలేక మనస్తాపంతో ఆ నిజాన్ని ఒప్పుకుని, చనిపోయాడు. ఆ తర్వాత అమెరికా అతడు చెప్పేది తప్పని కొట్టిపడేసింది. ఇలాంటివన్నీ ఎప్పుడు రహస్యాలుగానే మిగిలిపోతాయి. ఏదేమైనా.. ఓ గొప్ప వ్యక్తి, సింగర్‌ మనకు దూరమైపోయాడు’ అని పూరీ ముగించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని