Puri Musings: ఫెయిల్‌ అయితే ఫీల్‌ కావొద్దు - puri jagannadh latest musings on journey
close
Updated : 18/06/2021 13:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Puri Musings: ఫెయిల్‌ అయితే ఫీల్‌ కావొద్దు

సక్సెస్‌ కంటే దాని కోసం చేసే ప్రయాణమే ఎంతో ముఖ్యం..

హైదరాబాద్‌: సక్సెస్‌ కంటే కూడా దాని కోసం చేసే ప్రయాణమే జీవితంలో ఎంతో ముఖ్యమని ఇస్మార్ట్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ అన్నారు. తాజాగా ఆయన పూరీ మ్యూజింగ్స్‌ వేదికగా ‘జర్నీ’ అనే కాన్సెప్ట్‌ గురించి వివరించారు. జీవితంలో ఏది ఫ్రీగా వచ్చినా తీసుకోకూడదని.. దేనినైనా కష్టపడి సంపాదించుకోవాలని ఆయన సూచించారు. ఇంతకీ ఆయన ‘జర్నీ’ గురించి ఏమన్నారంటే..

‘కొన్ని వందల సంవత్సరాల క్రితం హుయాన్‌సాంగ్‌ అనే వ్యక్తి భారత్‌కు రావాలనుకున్నాడు. అందుకు చైనా అనుమతి ఇవ్వలేదు. దాంతో అతను పెషావర్‌ చేరుకుని అక్కడి నుంచి తక్షశిలకు వచ్చి.. అక్కడ ఉన్న బౌద్ధ మత ప్రబోధకులను కలిశాడు. భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు అతను వెళ్లాడు. నలంద విశ్వవిద్యాలయంలో 5 సంవత్సరాలపాటు జ్ఞానం సంపాదించుకున్నాడు. అలా.. 14 సంవత్సరాలపాటు భారతదేశంలో తిరిగి.. తన స్వదేశమైన చైనాకు వెళ్లగానే అక్కడి అధికారులు హుయాన్‌సాంగ్‌ను సత్కరించారు. అతడి జర్నీ స్ఫూర్తిదాయకమైనది. వాస్కోడిగామా, కొలంబస్‌, హుయాన్‌సాంగ్‌.. ఇలా చెప్పుకుంటూ వెళితే చరిత్రకు సంబంధించి కొంతమంది ట్రావెలర్స్‌ గుర్తుండిపోతారు. ఎందుకంటే వాళ్లంతా జీవన ప్రయాణం చేశారు. మనకు జీవితంలో ఏదీ ఫ్రీగా రాకూడదు. వచ్చినా తీసుకోకూడదు. సంపాదించుకోవాలి. దాని కోసం కష్టపడాలి. ఫ్రీగా వచ్చినవన్నీ పనికిరాని వాటితో సమానం’

‘జీవితంలో మనకంటూ ఒక గోల్‌ పెట్టుకోవాలి. ఆ గోల్‌ కోసం ఒక దారి సిద్ధమవుతుంది. ఆ దారి వెంట నడుచుకుంటూ వెళ్లడమే. ఎందుకంటే జర్నీ అనేది ఎంతో ముఖ్యమైనది. జీవితంలో ఒక విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో ఎంత సక్సెస్‌ వచ్చినా సరే.. అది ఎక్కువ కాలం ఉండలేదు. ఫెయిలయ్యామని ఎప్పుడూ బాధపడొద్దు. ఒక్కొసారి మనం గోల్‌ రీచ్‌ కావచ్చు.. కాకపోవచ్చు.. కానీ, అందరం ఎక్కువకాలం గడిపేది ప్రయాణంలోనే.. సక్సెస్‌లో కాదు. కాబట్టి ప్రయాణాన్ని ఎంజాయ్‌ చేయండి’ అని పూరీ వివరించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని