పూరి మాటల తూటాలు పాడ్‌కాస్ట్‌ రూపంలో...  - puri jagannadh releases his own podcast
close
Published : 21/07/2020 02:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పూరి మాటల తూటాలు పాడ్‌కాస్ట్‌ రూపంలో... 

ఇంటర్నెట్‌ డెస్క్‌: పూరి జగన్నాథ్‌ సినిమా డైలాగ్‌లే కాదు... బయట ఆయన మాటలు కూడా ఘాటుగానే ఉంటాయి. పంచ్‌లతో పిచ్చెక్కించే పూరి... జీవిత సత్యాలను డైలాగ్‌ల్లోనే చెప్పేస్తుంటాడు. అందుకే ఆయన సినిమాల్లో డైలాగ్‌లకు అంత క్రేజ్‌. లాక్‌డౌన్‌ కారణంగా పూరి మాటలు సినిమాల్లో విందామంటే కుదరడం లేదు. దీంతో యూట్యూబుల్లో, ఓటీటీల్లో పాత సినిమాల డైలాగ్‌లు విని ఆనందిస్తున్నారు అభిమానులు. మీరూ అలాంటివారే అయితే మీకో గుడ్‌ న్యూస్‌. ఆయన మాటలన్నీ మూటగట్టి ఓ పాడ్‌కాస్ట్‌ను రూపొందించాడు. 

‘హాయ్‌ నేను పూరి జగన్నాథ్‌.. ఇది నా పాడ్‌కాస్ట్‌ ‘మ్యూజింగ్స్‌’’ అంటూ పాడ్‌కాస్ట్‌ను మొదలుపెట్టారు పూరి. ‘ఇండియన్స్‌ అందరం ముసలోళ్లలా తయారయ్యాం’ అంటూ ‘అమెరికా’లో మన వ్యవహార శైలిపై చెంపచెల్లుమనిపించాడు. అమితాబ్‌ బచ్చన్‌ అంటే ఎందుకు ఇష్టం అనే విషయాన్ని ‘అమితాబ్‌ బచ్చన్‌’లో వివరించాడు. బ్రేకప్‌ అయితే... ఏం చేయాలి అనేది చేసుకోవాలో ‘బ్రేకప్‌’ అనే మ్యూజింగ్‌లో చెప్పాడు. మన కంటే వెదవలు సంఘం నిండా ఉన్నప్పుడు మనమెందుకు భయపడాలి అంటూ ‘లక్డీ కపూల్‌’లో కొంచెం గట్టిగానే చెప్పాడు. 

జీవితం గురించి, జీవితంలో బాగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశాల గురించి ఆ పాడ్‌కాస్ట్‌లో తన మాటల్లోనే వినిపించాడు. మొత్తంగా 46 విభిన్న అంశాల గురించి ఆ పాడ్‌కాస్ట్‌లో పూరి అభిప్రాయాలు ఉన్నాయి. మ్యూజింగ్స్‌ పేరుతో సిద్ధం చేసిన ఆ పాడ్‌కాస్ట్‌ను ఈ రోజు లాంచ్‌ చేశాడు. స్పాటిఫై, యాపిల్‌ పాడ్‌కాస్ట్‌లో Purijagannadh పేరుతో సెర్చ్‌ చేసి  ఈ పాడ్‌కాస్ట్‌ వినొచ్చు. లేదంటే యాపిల్‌ యూజర్లు ఈ లింక్‌లోను, ఆండ్రాయిడ్‌ యూజర్లు ఈ లింక్‌లోను పాడ్‌కాస్ట్‌లు వినొచ్చు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని