‘చిరుత’లో ‘నచ్చిమి’ పాత్ర ఎలా వచ్చిందంటే! - puri jagannath about ali character in chirutha
close
Published : 25/02/2021 13:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘చిరుత’లో ‘నచ్చిమి’ పాత్ర ఎలా వచ్చిందంటే!

ఇంటర్నెట్‌డెస్క్‌: మెగా కుటుంబం నుంచి ‘చిరుత’తో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చారు రామ్‌చరణ్‌. మాస్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ తెచ్చుకుంది. కాగా, పూరి చేసే ప్రతి చిత్రంలోనూ అలీకి ఓ పాత్ర తప్పకుండా ఉంటుంది. అయితే, ‘చిరుత’ కథ అనుకున్నప్పుడు అసలు ఇందులో అలీకి ఎలాంటి పాత్రా రాసుకోలేదట పూరి. కానీ, స్క్రిప్ట్‌ పనులపై బ్యాంకాక్‌ వెళ్తున్న సమయంలో ఎదురైన అనుభవాల కారణంగా అలీ కోసం పాత్రను సిద్ధం చేసినట్లు తెలిపారు.

‘‘చిరుత’ కథ ఓకే అయిన తర్వాత స్క్రిప్ట్‌ రాసుకోవడానికి బ్యాంకాక్‌ బయలుదేరాను. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లగానే సెక్యురిటీ చెక్‌ వద్ద ‘సర్‌ కొత్త సినిమా కోసం వెళ్తున్నారా.. అలీ ఏ పాత్రలో నటిస్తున్నారు?’ అని భద్రతా సిబ్బందిలో ఒకతను అడిగాడు. ఆ తర్వాత బోర్డింగ్‌ పాస్‌ తీసుకుంటున్న సమయంలోనూ మరో వ్యక్తి ‘సర్‌.. అలీ క్యారెక్టర్‌ ఏంటి’ అని అడిగాడు. దీంతో ఆలోచనలో పడ్డా. వెంటనే నిర్మాత అశ్వనీదత్‌గారికి ఫోన్‌ చేసి ‘సర్‌.. వెంటనే అలీ డేట్స్‌ తీసుకోండి. ఈ సినిమాలో ఆయనకు క్యారెక్టర్‌ ఇవ్వకపోతే జనాలు ఊరుకునేలా లేరు’ అని చెప్పడంతో అలీ డేట్స్‌ బుక్‌ చేశారు. బ్యాంకాక్‌ వెళ్లిన తర్వాత అక్కడి వాళ్లను చూసి ‘నచ్చిమి’ పాత్ర రాసుకున్నా. అది ఎంత సూపర్‌హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే’’ అని పూరి ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

‘చిరుత’లో నచ్చిమిగా అలీ పాత్ర, వేషధారణ, అన్నీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఆయన చేసిన క్యారెక్టర్‌లలో భిన్నమైన పాత్రగా నచ్చిమి గుర్తింపు తెచ్చింది. ఇప్పటికీ బుల్లితెరపై ‘నచ్చిమి’గా అలీ కనపడితే నవ్వులే నవ్వులు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని