Puri Musings: దీవెనలంటే నిజమైన అర్థమిది..! - puri latest musings on blessings
close
Published : 05/06/2021 14:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Puri Musings: దీవెనలంటే నిజమైన అర్థమిది..!

పూరీ ఏమన్నారంటే..?

హైదరాబాద్‌: సాయం చేయడానికి మించిన దీవెన మరొకటి లేదని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అన్నారు. ఈ రోజుల్లో దేవుడి లేదా పెద్దల ఆశీస్సుల కోసం ప్రతి ఒక్కరూ చూస్తుంటారని, అలాగే దీనికోసం ఎంత దూరమైనా వెళ్తారని ఆయన అన్నారు. అయితే, దీవెనలతోనే జీవితంలో కష్టాలు మాయం కావని, కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ‘‘ఎందుకైనా మంచిదని పెద్దవాళ్ల దీవెనలు తీసుకుంటుంటాం. ఏ దేవుడి ఫొటో చూసినా మనల్ని ఆశీర్వదిస్తున్నట్లే ఉంటుంది. అందరి దీవెనలూ తీసుకుని జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోవాలని అనుకుంటాం. అలాంటి ఆశీస్సుల కోసం మనం ఎక్కడికైనా, ఎంత దూరమైనా వెళ్తాం. అదే ఇక్కడ పెద్ద సమస్య. నిజానికి ఒకరి దీవెనల వల్ల మన సమస్యలేమీ తీరిపోవు. మనకు ఆశలు ఎక్కువ కాబట్టి అన్నీ నమ్ముతాం. మన ఏడుపులు ఏ దేవుడూ వినడు. అలాగే, దేవుడు మనల్ని ప్రేమించడు.. ద్వేషించడు.. పట్టించుకోడు..!! అందర్నీ దీవించుకుంటూ బతకడం దేవుడి పనికాదు. నీ తల్లి దీవెన కంటే ఇవేమీ గొప్పవి కాదు. పిల్లలు గొప్పవాళ్లు కావాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. వాటిని నిజం చేయాల్సింది మనం. నిజమైన బ్లెస్సింగ్స్‌ అంటే జ్ఞానాన్ని పంచడం.. సేవ చేయడం. బొట్లు, అక్షింతలు.. ఇలాంటివన్నీ మన జీవితంలో ఒక భాగం. ఉండనివ్వండి. కానీ వాటిపైనే నమ్మకాన్ని పెట్టుకోకండి. నువ్వు దాహంతో ఉన్నప్పుడు ఎవరైనా మంచినీళ్లు ఇస్తే అతనే దేవుడు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా చిన్నసాయం చేస్తే అతనే దేవుడు. ఎందుకంటే, సాయం చేయడమే నిజమైన బ్లెస్సింగ్‌’’ అని పూరీ వివరించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని