Puri Musings: పేదరికం చూడకుండా చావొద్దు - puri musintgs on poverty
close
Updated : 26/05/2021 14:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Puri Musings: పేదరికం చూడకుండా చావొద్దు

హైదరాబాద్‌: జీవితమంటే సరైన అర్థం తెలియాలంటే ప్రతిఒక్కరూ ఒక్కసారైనా పేదరికాన్ని అనుభవించాలని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అన్నారు. పూరీ మ్యూజింగ్స్‌ వేదికగా తాజాగా ఆయన ‘పేదరికం’ గురించి ముచ్చటించారు. ధనవంతుడిగా జీవించే వ్యక్తి చివరికి ఏమీ నేర్చుకోలేడని.. కానీ పేదరికంలో ఉండే వ్యక్తి ఎన్నో జీవిత పాఠాలు తెలుసుకోగలుగుతాడని అన్నారు. ‘పేదరికం’ గురించి ఆయన ఏమన్నారంటే..

‘డబ్బులో పుట్టి డబ్బులో పెరుగుతున్న రిచ్‌ కిడ్స్‌, అలాగే ఏ కష్టం తెలియకుండా తల్లిదండ్రుల నీడలో పెరుగుతున్న బంగారాల కోసమిది. మీ పిల్లల కోసం.. నా పిల్లల కోసం.. ఏ కష్టం తెలియకుండా పిల్లల్ని పెంచాలని మనం చూస్తాం.. అది చాలా తప్పు. వాళ్లకి కష్టం తెలియాలి. యుద్ధం తెలియాలి. యుద్ధం నేర్పకపోతే మీ కొడుకు అలెగ్జాండర్‌ కాలేడు. యుద్ధం చేయాలంటే వాడు కత్తిపట్టాలి. రక్తం చిందాలి’

‘పేదరికం ఎవరికీ నచ్చదు. అందులో ఉండాలని ఎవరూ కోరుకోరు. మనందరం డబ్బు కావాలని కోరుకుంటాం. దాని కోసం ఎంతో కష్టపడతాం. తప్పులేదు. కానీ ఒక ధనవంతుడిగా నువ్వు ఏదీ నేర్చుకోలేవు. ఒక పేదవాడిగా నువ్వు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మీకు ఎంత డబ్బు ఉన్నా సరే జీవితంలో ఒక్కసారైనా పేదవాడిగా జీవించండి. కనీసం ఒక్క నెలరోజులైనా వేరే ఊరుకి వెళ్లి మీ కాళ్లపై మీరు నిలబడండి. జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది. కష్టం, కన్నీళ్లుకు సరైన నిర్వచనం అర్థమవుతుంది. కష్టపడి సంపాదించిన డబ్బుని మీ అమ్మనాన్నలకు ఇవ్వండి. ఇన్నాళ్లు మీకోసం వాళ్లు ఎంత చేశారో అర్థమవుతుంది. జీవితాంతం ధనవంతుడిగా బతకడానికి ముందు ఒక్కసారి పేదరికం చూడండి. చనిపోయేలోపు ఒక్కసారైన పేదవాడిగా బతకండి. పేదరికం చూడకుండా అస్సలు చావొద్దు’ అని పూరీ వివరించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని