Pushpa: దాక్కో దాక్కో మేక.. వచ్చేసింది పులి..! - pushpa first single dakko dakko meka out now
close
Updated : 13/08/2021 11:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Pushpa: దాక్కో దాక్కో మేక.. వచ్చేసింది పులి..!

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా... సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక  కథానాయిక. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో, రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాలోని ‘దాక్కో దాక్కో మేక...’ పాటని శుక్రవారం విడుదల చేశారు.

ఐదు భాషల్లో పాట విడుదల కానుంది. తెలుగులో శివం, హిందీలో విశాల్‌ దడ్లాని, కన్నడంలో విజయ ప్రకాష్‌, తమిళంలో బెన్నీ దయాల్‌, మలయాళంలో రాహుల్‌ నంబియార్‌ పాటని ఆలపించారు. కథానాయకుడు అల్లు అర్జున్‌ కనిపించే విధానం, ఆయన సందడి హైలైట్‌ అవుతుందని సినీ వర్గాలు తెలిపాయి. ‘పుష్ప’ తొలి భాగాన్ని క్రిస్మస్‌సందర్భంగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా ఫహాద్‌ ఫాజిల్‌ నటించారు. ధనుంజయ్‌, అజయ్‌, శత్రు, సునీల్‌, రావు రమేష్‌, అజయ్‌ ఘోష్‌, అనసూయ భరద్వాజ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని