అక్కడికి వెళ్లి వచ్చారా.. ఆంక్షలివే! - quarantine must for kumbh mela returnees
close
Updated : 18/04/2021 14:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్కడికి వెళ్లి వచ్చారా.. ఆంక్షలివే!

దిల్లీ : దేశంలో రెండో దశ కొవిడ్‌ విజృంభణ ప్రమాదకరస్థాయిలో కొనసాగుతోంది. దీంతో పలు రాష్ట్రాలు కరోనా కట్టడి కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు హరిద్వార్‌ కుంభమేళాలో పాల్గొని సొంత రాష్ట్రాలకు తిరిగి వచ్చే భక్తులపై కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. ఇటీవల హరిద్వార్‌లో పెద్దసంఖ్యలో సాధువులు కొవిడ్‌ బారిన పడిన విషయం తెలిసిందే. గత ఐదు రోజుల్లో అక్కడ 2 వేలకు పైగా వైరస్‌ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

*మహారాష్ట్ర తర్వాత వైరస్‌తో ఎక్కువ ప్రభావితమైన దిల్లీ.. హరిద్వార్ నుంచి తిరిగి వచ్చే భక్తులపై ఆంక్షలు విధించింది. కుంభమేళాలో పాల్గొని దిల్లీకి తిరిగివచ్చే వారు 14 రోజుల హోమ్‌ క్వారంటైన్‌లో తప్పనిసరిగా ఉండాలని దిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్‌ 4 నుంచి హరిద్వార్‌ కుంభమేళాలో పాల్గొని దిల్లీకి తిరిగి వచ్చిన వారు, ఈ నెల 30లోపు అక్కడికి వెళ్లి వచ్చేవారు తప్పనిసరిగా వారి వివరాలను దిల్లీ ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు.

*ఇటీవల మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఇలాంటి ఆదేశాలే జారీ చేసింది. హరిద్వార్‌ నుంచి తిరిగివచ్చే భక్తులకు తప్పనిసరి క్వారంటైన్‌ విధించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.

*కుంభమేళా నుంచి తిరిగి వచ్చే వారు ఆర్టీ-పీసీఆర్‌ టెస్టు రిపోర్టులతోనే రాష్ట్రంలో అడుగుపెట్టాలని అటు గుజరాత్‌ ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది.

* ఒడిశా కూడా హరిద్వార్‌ నుంచి తిరిగి వచ్చే భక్తులకు 14 రోజుల క్వారంటైన్‌ విధించింది. రాష్ట్రంలో అడుగుపెట్టేముందే ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని