రాశీ ఖన్నా సవాలు స్వీకరించేదెవరంటే! - raashi khanna accepts green india challenge and nominates three star heroines
close
Updated : 20/07/2020 20:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాశీ ఖన్నా సవాలు స్వీకరించేదెవరంటే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా టాలీవుడ్‌ తారలు మొక్కలు నాటి... మీరూ మొక్కలు నాటండి అని పిలుపునిస్తున్నారు. ఇటీవల యువ కథానాయిక రష్మిక మందన మొక్కలు నాటి రాశీ ఖన్నాకు ఛాలెంజ్‌ విసిరిన విషయం తెలిసిందే. దానిని స్వీకరించిన రాశి ఖన్నా ఈ రోజు మొక్కలు నాటారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను ట్వీట్‌ చేశారు. దీంతోపాటు మరో ముగ్గురుని నామినేట్‌ కూడా చేశారు. 

‘‘నన్ను గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో నామినేట్‌ చేసినందుకు రష్మిక మందనకు ధన్యవాదాలు’’ అని రాశీ ట్వీట్‌ చేశారు. దీంతోపాటు ‘‘ఈ ట్వీట్‌ చదువుతున్న అందరూ మొక్కలు నాటండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొనేలా చేయండి. ఈ ఛాలెంజ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లండి’’ అని రాశీ కోరారు. ఈ హరిత సవాలులో పాల్గొనాల్సిందిగా ప్రముఖ కథానాయికలు రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కాజల్‌ అగర్వాల్‌, తమన్నాను రాశీ ఖన్నా నామినేట్‌ చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని