‘రాధేశ్యామ్‌’ టీజర్‌ వచ్చేసింది..! - radheshyam teaser out now
close
Updated : 14/02/2021 09:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రాధేశ్యామ్‌’ టీజర్‌ వచ్చేసింది..!

హైదరాబాద్‌: సినీ ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. ప్రేమికుల రోజుకు సరైన నిర్వచనం ఇస్తూ ‘రాధేశ్యామ్‌’ టీజర్‌ విడుదలైంది. ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘డార్లింగ్‌’ చిత్రాల తర్వాత  ప్రభాస్‌ లవర్‌బాయ్‌ పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా టీజర్‌ కోసం అభిమానులందరూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తాజాగా ‘రాధేశ్యామ్‌’ టీజర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ‘నువ్వు ఏమైనా రోమియో అనుకుంటున్నావా?’ అని పూజా ప్రశ్నించగా.. ‘ఛ.. వాడు ప్రేమ కోసం చచ్చాడు. నేను ఆ టైప్‌ కాదు’ అంటూ ప్రభాస్‌ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకునేలా ఉంది. జులై 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ‘రాధేశ్యామ్‌’కు కె.రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ‘బాహుబలి’, ‘సాహో’ సినిమాల తర్వాత ఇందులో ప్రభాస్‌ లవర్‌బాయ్‌గా సాఫ్ట్‌ లుక్‌లో విక్రమాదిత్య అనే పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్‌కు జోడీగా పూజాహెగ్డే.. ప్రేరణగా మెప్పించనున్నారు. పాన్‌ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి దక్షిణాదిలో జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలు అందిస్తుండగా.. హిందీలో మిథున్‌, మనన్‌ భరద్వాజ్‌ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. అలనాటి నటి భాగ్యశ్రీ, ప్రియదర్శి, మురళీ శర్మ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి ప్రేమ కథలో ప్రభాస్‌ నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదీ చదవండి

శంకర్‌-చరణ్‌ మూవీ: ఆసక్తికర విషయాలివే!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని