Dasara Bullollu: రాఘవేంద్రరావు ముందు ఆయన్నే ఇమిటేట్‌ చేస్తే ఇలా ఉంటుంది! - raghava naresh naveen performance in dasara bullollu
close
Published : 17/10/2021 23:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Dasara Bullollu: రాఘవేంద్రరావు ముందు ఆయన్నే ఇమిటేట్‌ చేస్తే ఇలా ఉంటుంది!

హైదరాబాద్‌: ఒక సాధారణ కథకు కమర్షియల్‌ హంగులు అద్ది, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన అతి తక్కువ మంది దర్శకుల్లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ముందుంటారు. ఒకప్పుడు కథానాయికలందరూ ఒక్కసారైనా ఆయన దర్శకత్వంలో నటించాలని ఉవ్విళ్లూరుతుండేవారు. మరే ఇతర దర్శకుడు చూపించనంత అందంగా రాఘవేంద్రరావు కథానాయికలను తెరపై చూపించేవారు. మరి అలాంటి దర్శక దిగ్గజాన్ని అనుకరించి నవ్వులు పంచారు ‘రాకెట్‌’ రాఘవ, నవీన్‌, నరేశ్‌లు. దసరా సందర్భంగా ఈటీవీలో ప్రసారమైన ‘దసరా బులోళ్లు’ కార్యక్రమానికి ‘పెళ్లి సందD’ చిత్రం బృందంతో కలిసి రాఘవేంద్రరావు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనను అనుకరిస్తూ నవీన్‌ పలికించిన హావభావాలు, రాఘవ వేసిన పంచ్‌లు, మధ్యలో నరేశ్‌ డైలాగ్‌లు కడుపుబ్బా నవ్వించాయి. స్వయంగా స్కిట్ చూసిన రాఘవేంద్రరావు సైతం నవ్వాపుకోలేకపోయారు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత విష్ణు డ్యాన్స్‌ ప్రదర్శన కూడా అలరించింది. మరి ఆ ప్రదర్శనలను మీరూ చూసేయండి.




Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని