Rahul Dravid: భారత్‌ శ్రీలంక పర్యటనకు కోచ్‌ - rahul dravid will lead team india as a coach for sri lankan tour
close
Published : 20/05/2021 23:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rahul Dravid: భారత్‌ శ్రీలంక పర్యటనకు కోచ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: జులైలో శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు టీమ్‌ఇండియా కోచ్‌గా జాతీయ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఓ బీసీసీఐ ప్రతినిధి వెల్లడించారు. హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి ఆ సమయంలో ఇంగ్లాండ్‌లో ఉండనున్న నేపథ్యంలో లంక పర్యటనకు ద్రవిడ్‌ను ఎంపిక చేసినట్లు ఆయన అన్నారు. బౌలింగ్‌ కోచ్‌గా పరాస్‌ మాంబ్రే సైతం వారితో వెళ్లనున్నాడు.

కాగా, టీమ్‌ఇండియా వచ్చేనెలలో సౌథాంప్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో తలపడనుంది. జూన్‌ 18 నుంచి 22 వరకు ఈ మ్యాచ్‌ జరగనుంది. అనంతరం ఆగస్టులో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలోనే ఆ రెండు ఈవెంట్లకు కలిపి బీసీసీఐ కొద్ది రోజుల క్రితం 24 మంది సభ్యుల జాబితా ప్రకటించింది. వీరంతా జూన్‌ 2న భారత్‌ నుంచి లండన్‌ చేరుకుంటారు. అక్కడ కొద్ది రోజులు క్వారంటైన్‌లో ఉంటారు.

అయితే, టెస్టు ఛాంపియన్‌షిప్‌ పూర్తయ్యాక టీమ్‌ఇండియా అక్కడే ఉండనుంది. దాంతో రవిశాస్త్రి సైతం జట్టుతో కలిసే ఉంటాడు. మరోవైపు జులైలో శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్‌లు ఆడేందుకు బీసీసీఐ ఆమోదం తెలిపింది. అందుకోసం రాహుల్‌ ద్రవిడ్‌ను ఎంపిక చేశారు. కాగా, ద్రవిడ్‌కు ఇదివరకు ఇండియా ఏ, అండర్‌-19 జట్లకు కోచ్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది. ఈ పర్యటనపై ఇంకా తేదీలు ఖరారు కానప్పటికీ టీమ్‌ఇండియా కెప్టెన్‌గా శిఖర్‌ధావన్‌, హార్దిక్‌ పాండ్య, శ్రేయస్‌ అయ్యర్‌ పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవరు కెప్టెన్సీ చేపడతారో వేచిచూడాలి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని