Rahul gandhi: వీడియో కాల్స్‌ కాదు.. పాత నజరానాల సంగతి చూడండి: రాహుల్‌ - rahul gandhi comments on pending dues to neeraj and bajrang
close
Published : 10/08/2021 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rahul gandhi: వీడియో కాల్స్‌ కాదు.. పాత నజరానాల సంగతి చూడండి: రాహుల్‌

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన కొందరు క్రీడాకారులకు ఇప్పటికీ పాత నజరానాలకు సంబంధించిన బకాయిలు చెల్లించకపోవడంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. ‘ఫోన్‌, వీడియో కాల్స్‌ చాలు.. ముందు క్రీడాకారులకు చెల్లించాల్సి పాత బకాయిల సంగతి చూడండి’ అని సూచించారు. తాజాగా ఒలింపిక్స్‌లో పతకాలు పొందిన వారికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పురస్కారాలు ప్రకటించిన నేపథ్యంలో రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌లో గెలుపొందిన భారత క్రీడాకారులకు ప్రధాని సహా పలువురు అభినందనలు తెలిపారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు నజరానాలు కూడా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో క్రీడాకారులకు అభినందనలే కాదు.. నగదు పురస్కారాల బకాయిలు కూడా అందిస్తే  బాగుంటుందని పరోక్షంగా ప్రధానిపై రాహుల్‌ విమర్శలు గుప్పించారు. బడ్జెట్‌లో క్రీడలకు కేటాయింపుల్లో కోతలు పెట్టడాన్నీ దుయ్యబట్టారు. ఈ సందర్భంగా నాలుగేళ్లుగా బకాయిల కోసం చూస్తున్న క్రీడాకారులు అంటూ ఓ ఆంగ్లపత్రికలో వచ్చిన క్లిప్పింగ్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. బకాయిలపై 2019లో బజరంగ్‌ పునియా, నీరజ్‌ చోప్రా చేసిన ట్వీట్ల స్క్రీన్‌ షాట్లను సైతం రాహుల్‌ జతచేశారు. ఆసియా క్రీడల్లో గెలుపొందిన బజరంగ్‌ పునియాకు అప్పట్లో హరియాణా హోంమంత్రి అనిల్‌ విజ్‌ రూ.3 కోట్లు నగదు పురస్కారం ఇస్తామని ప్రకటించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని