బాధ్యతగా వ్యవహరిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు! - rahul gandhi had govt done its job it would not have come to this
close
Published : 11/05/2021 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాధ్యతగా వ్యవహరిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు!

కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ రాహుల్‌ గాంధీ

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు గుప్పిస్తూనే ఉంది. కరోనా సమయంలో కేంద్రం తన బాధ్యతలను సరిగా నిర్వర్తించి ఉంటే విదేశాల నుంచి భారత్‌ సహాయం పొందే అవసరం వచ్చేదికాదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. విదేశాల నుంచి సహాయం పొందుతూ కూడా కేంద్రం తన చర్యలను సమర్థించుకోవడం బాధాకరమని ట్విటర్‌లో పేర్కొన్నారు. వివిధ దేశాల నుంచి అందుతున్న సహాయంపై కేంద్రం పారదర్శకత పాటించాలని.. ఇప్పటివరకు విదేశాల నుంచి సహాయ సామగ్రి వివరాలను వెల్లడించాలని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు.

ఇక కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడానికి సమైక్యంగా సమగ్ర కార్యచరణ రూపొందించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. అందుకు వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని పిలవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఓవైపు టీకాల కొరతతో రాష్ట్రాలు ఇబ్బందులు పడుతుండడం, మరోవైపు ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, ఆస్పత్రిలో పడకలు, అంత్యక్రియల సదుపాయలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. వీటిపై వెంటనే చర్చించి సమగ్ర కార్యచరణను రూపొందించాలని కోరారు.

సెకండ్‌ వేవ్‌తో అల్లాడుతోన్న భారత్‌లో ఆక్సిజన్‌, వైద్య పరికరాల కొరత వెంటాడుతోంది. దీంతో భారత్‌కు సహాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, జర్మనీ, యూకే, ఇర్లాండ్‌, బెల్జియం, సింగపూర్‌, స్విడన్‌, కువైట్‌తో పాటు మరిన్ని దేశాలు ఆక్సిజన్‌, వైద్య పరికరాలను భారీ స్థాయిలో అందజేస్తున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని