BJP: రాహుల్‌.. ట్యాపింగ్‌పై దర్యాప్తునకు మీ ఫోన్‌ ఇవ్వండి! - rahul gandhi should submit phone for investigation says bjp
close
Published : 24/07/2021 00:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

BJP: రాహుల్‌.. ట్యాపింగ్‌పై దర్యాప్తునకు మీ ఫోన్‌ ఇవ్వండి!

దిల్లీ: తన ఫోన్‌ను కూడా ట్యాప్‌ చేశారంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలకు భాజపా గట్టిగా కౌంటర్‌ ఇచ్చింది. ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని ఆయన భావిస్తే.. దర్యాప్తు సంస్థకు రాహుల్‌ ఫోన్‌ను సమర్పించాలని అడిగింది. మోదీ ప్రభుత్వం అక్రమంగా ఎవరి ఫోన్‌నూ ట్యాప్‌ చేయలేదని భాజపా జాతీయ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాఠోర్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు తిరస్కరించడంతో ఒకటి కాకపోతే మరో కారణం చూపి పార్లమెంటు కార్యకలాపాలను స్తంభింపజేయాలని కంకణం కట్టుకొందని ఆరోపించారు. దేశ అభివృద్ధిని కాంగ్రెస్‌ పార్టీ అంగీకరించలేకపోతోందని, అందుకే ఏదో ఒక కారణంతో పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటోందని మండిపడ్డారు. రాహుల్‌గాంధీ తన ఫోన్‌ను దర్యాప్తు సంస్థకు అప్పగించాలని, రాజ్యాంగ బద్ధంగానే దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు.

మరోవైపు, పెగాసస్‌ వ్యవహారం శుక్రవారం కూడా పార్లమెంట్‌ ఉభయ సభలను కుదిపేసింది. విపక్షాల నిరసనలతో సభాకార్యకలాపాలు నిలిచిపోవడంతో లోక్‌సభ, రాజ్యసభ సోమవారానికి వాయిదా పడ్డాయి. అంతకముందు పార్లమెంట్‌ బయట మీడియాతో మాట్లాడిన రాహుల్‌ గాంధీ.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. దేశీయ వ్యక్తులు, సంస్థలపై ‘పెగాసస్‌’ స్పైవేర్‌తో నిఘా పెట్టారని ఆరోపించారు. ఇది పూర్తిగా రాజద్రోహమేనన్నారు. తన ఫోన్‌ను కూడా ట్యాప్‌ చేశారని, హోంమంత్రి అమిత్‌ షా పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని