వెంటిలేటర్లు లేవు.. వ్యాక్సిన్లు లేవు: రాహుల్‌ - rahul gandhi targets centre over handling of covid19 situation
close
Published : 16/04/2021 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వెంటిలేటర్లు లేవు.. వ్యాక్సిన్లు లేవు: రాహుల్‌

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌కు సంబంధించి ప్రస్తుత పరిస్థితులను ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. కరోనా నివారణకు చర్యలు తీసుకోవడంలో కేంద్రం విఫలమైందని గురువారం ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. ‘దేశంలో కరోనా టెస్టులు సరిగా నిర్వహించడం లేదు. ఆస్పత్రుల్లో రోగులకు పడకలు లేవు. అత్యవసరమైన రోగులకు వెంటిలేటర్లు లేవు.. ఆక్సిజన్‌ లేదు. చివరకు వ్యాక్సిన్లు కూడా లేవు. కరోనా నిర్వహణకు పీఎంకేర్స్‌కు భారీగా నిధులు వస్తున్నాయి. మరి ట్రస్ట్‌ ఆ నిధుల్ని ఏం చేస్తోంది?’ అంటూ రాహుల్‌ కేంద్రాన్ని నిలదీశారు. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్‌, వ్యాక్సిన్ల కొరత ఉన్నట్లు కేంద్రానికి నివేదిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాహుల్‌గాంధీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

కాగా గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 2,00,739 కేసులు నమోదు కాగా, 1,038 మంది ప్రాణాలు వదిలారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1.40కోట్లు దాటింది.  
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని