టీకా ఎగుమతులను తక్షణమే నిలిపివేయండి - rahul gandhi writes to pm modi seeks immediate moratorium on covid-19 vaccine exports.
close
Updated : 09/04/2021 15:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకా ఎగుమతులను తక్షణమే నిలిపివేయండి

ప్రధానికి రాహుల్‌గాంధీ లేఖ

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తున్న వేళ టీకాల ఎగుమతి సరికాదంటున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. తాజాగా ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. వ్యాక్సిన్ల ఎగుమతిని తక్షణమే నిలిపివేసి, దేశంలో అవసరమైన ప్రతి ఒక్కరికీ టీకాలు వేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రధానిని కోరారు. 

‘‘కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది కాలంగా దేశం తీవ్రంగా నష్టపోయింది. ఎంతోమంది ప్రాణాలను కోల్పోయింది. ఇప్పడు వైరస్‌ మరోసారి విజృంభిస్తోంది. మహమ్మారిని పారదోలేందుకు మన శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి వ్యాక్సిన్‌ రూపంలో పరిష్కారం కనుగొన్నారు. కానీ ఆ పరిష్కారాన్ని అమలు చేయడంలో కేంద్రం పేలవంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల శాస్త్రవేత్తలు, వ్యాక్సిన్‌ సరఫరాదారుల కృషి వృథా అవుతుండటం దురదృష్టకరం’’ అని రాహుల్‌ ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. 

ఓ వైపు దేశంలో టీకాల కొరతతో ఇబ్బంది పడుతుంటే, ప్రభుత్వం వాటి ఎగుమతులను ఎందుకు అనుమతిస్తోందని ఆయన మరోసారి ప్రశ్నించారు. వ్యాక్సిన్ల కొరతపై రాష్ట్రాలు పదేపదే కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నా.. ప్రభుత్వం నుంచి నిర్లక్ష్యపు సమాధానమే వస్తోందని దుయ్యబట్టారు. ‘కేంద్రం తీసుకుంటున్న పొరబాటు నిర్ణయాల్లో టీకా ఎగుమతులు కూడా ఒకటా? లేదా సొంత ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి పబ్లిసిటీ కోసం చేస్తున్న ప్రయత్నాలా?’ అని రాహుల్‌ మండిపడ్డారు. 

ఈ సందర్భంగా టీకా పంపిణీపై రాహుల్‌ కేంద్రానికి కొన్ని సూచనలు కూడా చేశారు.

1. టీకాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేలా వ్యాక్సిన్‌ సరఫరాదారులకు అన్ని వనరులు కల్పించండి.

2. టీకా ఎగుమతులపై తక్షణమే మారటోరియం విధించండి.

3. నిబంధనలకు అనుగుణంగా ఇతర వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయండి.

4. అవసరమైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్‌ అందుబాటులోకి తీసుకురండి.

5. టీకాల కొనుగోలు కోసం కేటాయించిన రూ.35వేల కోట్ల బడ్జెట్‌ను రెట్టింపు చేయండి. 

6. వ్యాక్సిన్ల కొనుగోలు, పంపిణీపై అన్ని రాష్ట్రాలకు భరోసా ఇవ్వండి.

7. రెండో దశలో పేద వర్గాల ప్రజలకు నేరుగా ఆర్థికసాయం అందజేయండి.. అని రాహుల్ లేఖలో కోరారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని