వారు నవ్వినా..మనమే గెలుస్తాం: రాహుల్  - rahul gandhis jibe at center
close
Published : 15/04/2021 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారు నవ్వినా..మనమే గెలుస్తాం: రాహుల్ 

దిల్లీ: కరోనా టీకా కొరతను అధిగమించేందుకు వివిధ దేశాల్లో ఆమోదం పొందిన టీకాలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాశారు. ఈ క్రమంలో కేంద్రం నిర్ణయం వెలువడటంపై ఆయన స్పందించారు. 

‘మొదట వారు మిమ్మల్ని విస్మరిస్తారు. తరవాత నవ్వుతారు. మీతో పోరాడతారు. చివరికి మీరే గెలుస్తారు’ అంటూ కేంద్రంపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. రష్యాలో అభివృద్ధి అయిన స్పుత్నిక్ వి టీకాను భారత్ అత్యవసర వినియోగానికి ఆమోదించిన వార్తను షేర్ చేస్తూ రాహుల్ ఈ విమర్శలు చేశారు. కాగా, కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంతో విదేశాల్లో ఇప్పటికే వినియోగిస్తోన్న మోడెర్నా, జాన్సన్‌ అండ్ జాన్సన్‌, ఫైజర్ టీకాలకు మార్గం సుగమం కానుంది.

కరోనా టీకాలకు సంబంధించి కొద్ది రోజుల క్రితం రాహుల్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. నిబంధనలకు అనుగుణంగా ఇతర టీకాల అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని దానిలో సూచించిన సంగతి తెలిసిందే. దానిపై అధికార పార్టీ నేతలు విమర్శలు చేశారు. ఇక తాజాగా దేశవ్యాప్తంగా 1,84,372 కొత్త కేసులు నమోదయి, 1,027 మృతి చెందారు. అలాగే ఇప్పటివరకు కేంద్రం 11 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేసింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని