మోదీ సర్కారు జేబులు ఖాళీ చేస్తోంది: రాహుల్‌ - rahul jibe at centre on fuel prices hiked
close
Published : 22/02/2021 16:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోదీ సర్కారు జేబులు ఖాళీ చేస్తోంది: రాహుల్‌

దిల్లీ: దేశంలో ఇంధన ధరల పెరుగుదలను తప్పుబడుతూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ సోమవారం కేంద్రంపై విరుచుకుపడ్డారు. ప్రజల జేబులను ఖాళీ చేయడంలో ప్రభుత్వం గొప్ప పనిచేస్తోందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్విటర్‌ వేదికగా కేంద్రంపై మండిపడ్డారు. 

‘పెట్రోల్‌ పంపులో ఇంధనం నింపుకొనేందుకు వెళ్లినప్పుడు ముడి చమురు ధరల మీటర్‌ను పరిశీలించండి. అందులో వాటి ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదనే విషయాన్ని మీరు గమనించాలి. కానీ, మన దేశంలో మాత్రం పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.100కు చేరింది. ప్రజల జేబులు ఖాళీ చేసి తన మిత్రులకు పంచిపెట్టడంతో నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం గొప్పగా పనిచేస్తోంది’ అని కేంద్రంపై రాహుల్‌ ధ్వజమెత్తారు. కాగా కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ సైతం దేశంలో పెట్రో ధరల పెంపును వ్యతిరేకిస్తూ.. ఆదివారం కేంద్రంపై మండిపడిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ.. దేశంలో పెట్రో ధరలు పెంచడం దోపిడీ కిందకే వస్తుందని ఆరోపించారు. వెంటనే చమురు ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ.. ఆమె మోదీకి లేఖ రాశారు. 

దేశంలో పెట్రోల్‌ ధరలు ఇటీవల వరుసగా 12 రోజులు పెరిగిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే పెట్రోల్‌ ధరలు తగ్గించాలంటూ ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నాయి. మరోవైపు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆదివారం ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాలు అధిక లాభాల కోసం ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. ఆ కారణంగానే ఇంధన ధరలు పెరుగుతున్నాయి’ అని చెప్పుకొచ్చారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని