బాలయ్య చిత్రంలో నాయికగా రాయ్‌లక్ష్మి? - rai lakshmi is heroin in balakrishna movie
close
Published : 06/05/2021 16:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలయ్య చిత్రంలో నాయికగా రాయ్‌లక్ష్మి?

ఇంటర్నెట్‌ డెస్క్: బాలయ్య సినిమా అంటే యాక్షన్‌తో పాటు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా ఉంటుందన్న సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా బాలయ్య సినిమాలు గమనిస్తే ఇద్దరు కథానాయికలు ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ‘క్రాక్‌’ చిత్ర దర్శకుడు మలినేని గోపీచంద్‌తో ఓ సినిమా చేయనున్నారు. గోపీ సినిమాలు అంటే కచ్చితంగా ఐటెమ్‌ సాంగ్‌ ఉంటుంది. అందుకోసమే రాయ్‌ లక్ష్మితో ప్రత్యేకగీతం చేయించాలని అనుకున్నారట. అయితే చివరకు ఆమెనే కథానాయికగా ఎంపిక చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. రాయ్‌ లక్ష్మి తెలుగులో ఇప్పటికే పలు ఐటెమ్‌ గీతాల్లో సందడి చేసింది. తెలుగులో మొదట రాయ్‌ లక్ష్మి ఐటెమ్‌ భామగా అలరించింది మలినేని దర్శకత్వం వహించిన ‘బలుపు’ సినిమాతోనే. బాలకృష్ణతో గతంలో ‘అధినాయకుడు’లో కథానాయికగా అలరించింది. ప్రస్తుతం రాయ్‌ లక్ష్మి తెలుగులో ‘ఆనంద భైరవి’ అనే చిత్రంలో నటిస్తోంది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని