కౌంటర్ టికెట్ల రద్దు గడువు పెంపు - railways extends to 9-months time to claim refunds for trains cancelled from mar 21-jun 31 last year
close
Published : 07/01/2021 21:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కౌంటర్ టికెట్ల రద్దు గడువు పెంపు

దిల్లీ: కరోనా సంక్షోభం దృష్ట్యా 2020 మార్చి 21 నుంచి జూన్ 31 మధ్య బుక్‌ చేసుకున్న రైల్వే కౌంటర్ టికెట్ల రద్దు కాలపరిమితిని రైల్వే శాఖ పొడిగించింది. ప్రస్తుతం ఆరు నెలలుగా ఉన్న కాలపరిమితిని తొమ్మిది నెలలకు పెంచింది. కరోనా వైరస్ మహమ్మారి వల్ల మార్చిలో అన్ని సాధారణ రైళ్లను రద్దు చేశారు. దీంతో కౌంటర్‌ టికెట్లను రద్దు చేసుకోవడానికి తొలుత మూడు రోజుల నుంచి ఆరు నెలల వరకు గడువిచ్చారు. రద్దయిన సాధారణ రైళ్లకు మాత్రమే ఈ గడువు వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణ తేదీ నుంచి ఆరు నెలలు తరువాత ఒరిజినల్‌ టికెట్లను సాధారణ అప్లికేషన్‌తో జోనల్ రైల్వే కార్యాలయంలో అందించిన ప్రయాణికులకు ఛార్జీలు వాపసు ఇస్తామని రైల్వే శాఖ తెలిపింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని