Oxygen Express: రైల్వేశాఖ కీలక నిర్ణయం - railways to run oxygen express trains to meet high demand amid surge in covid-19 cases
close
Updated : 18/04/2021 22:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Oxygen Express: రైల్వేశాఖ కీలక నిర్ణయం

న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరోవైపు ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ సిలిండర్లను ఆస్పత్రులకు త్వరితగతిన చేరవేసేందుకు ‘ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌’ పేరుతో ఓ రైలు నడపనున్నట్లు ప్రకటించింది.

అన్ని రాష్ట్రాలూ మెడికల్‌ ఆక్సిజన్‌ కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో రైల్వేశాఖ ప్రత్యేక ట్యాంకర్లతో కూడిన రైలును నడపనుంది. ముంబయి సమీపంలోని కాలామ్‌బాలి, బోయిసర్‌ రైల్వేస్టేషన్‌ల నుంచి ఖాళీ ట్యాంకర్లతో కూడిన రైలు విశాఖ, జెంషెడ్‌పూర్‌, రూర్కెలా, బొకారాల నుంచి ఆక్సిజన్‌ నింపుకొని ఆస్పత్రులకు చేరవేస్తుంది. ఈ విషయమై ఇప్పటికే మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలు రైల్వేశాఖను సంప్రదించాయి. దీంతో స్పందించిన రైల్వేశాఖ హుటాహుటీన కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకోసం గ్రీన్‌ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ట్యాంకర్లను ఎక్కించేందుకు దించేందుకు ఎక్కడిక్కడ ర్యాంప్‌లు ఏర్పాటు చేయాలని జోనల్‌ రైల్వేస్‌కు సూచనలు అందాయి. ఇప్పటికే పలు చోట్ల ర్యాంప్‌ల నిర్మాణం చేపట్టారు. రైలు ఆయా ప్రాంతాలకు చేరుకునే సమయానికి వాటిని పూర్తి చేయనున్నారు. రైలు మార్గం ద్వారా వచ్చిన ట్యాంకర్లు రోడ్లపై వెళ్లేటప్పుడు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఎత్తు, వెడల్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని