మహీ సిక్సర్‌.. సీటీ కొట్టిన రైనా! - raina whistle for mahi sixer
close
Published : 22/08/2020 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహీ సిక్సర్‌.. సీటీ కొట్టిన రైనా!

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అంటేనే అభిమానుల సందడికి మరోపేరు. ముంబయి ఇండియన్స్‌ లాంటి జట్టు ఆడితే స్టేడియాలు నిండిపోతాయన్న సంగతి తెలిసిందే. కానీ చెన్నై సూపర్‌కింగ్స్‌ మాత్రం కొంత ప్రత్యేకం. ఎందుకంటే ఆ జట్టు ప్రధాన ఆటగాళ్లు ఎంఎస్‌ ధోనీ, సురేశ్‌ రైనా సాధన చేస్తున్నారని తెలిసినా సరే చెపాక్‌ సగం నిండిపోతుంది.

సీఎస్కేపై చెన్నై వాసులు ఎనలేని ప్రేమ కనబరుస్తారు. గతేడాది ఐపీఎల్‌ ఆరంభానికి ముందు చెపాక్‌లో ఆ ఫ్రాంచైజీ శిక్షణా శిబిరం ఏర్పాటు చేసింది. మహీ, రైనా, అంబటి, భజ్జీ సహా మిగతా ఆటగాళ్ల సాధన చూసేందుకు రెండు స్టాండ్స్‌కు అనుమతి ఇచ్చింది. అంతే.. పదివేల మందికి పైగా వచ్చేశారు. మిగతా స్టాండ్స్‌కు అనుమతి లేకపోవడంతో కొందరు నిలబడ్డారు.

కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా అభిమానులకు ఈ సారి అలాంటి అవకాశం దక్కలేదు. ప్రాక్టీస్‌లో మహీ బాదే సిక్సర్లను చూడలేకపోయారు. అయినప్పటికీ తాము అద్భుతంగా సాధనను ముగించామని చెన్నై సూపర్‌కింగ్స్‌ తెలిపింది. ధోనీ సిక్సర్లను బాదే వీడియోను జత చేసింది. అయితే వీడియో ముగిసేటప్పుడు కెప్టెన్‌ బాదిన భారీ సిక్సర్‌కు రైనా సీటీకొట్టి అభినందించడం గమనార్హం. 

‘కరోనా వైరస్‌ వల్ల అభిమానులు ఈ సారి సూపర్‌ క్యాంప్‌ను మిస్సయ్యారు. అయినప్పటికీ ఓ పెద్ద ఈలతో మేం శిబిరాన్ని ముగించాం’ అని సీఎస్కే ట్వీట్‌ చేసింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని