Raj Kundra: పోర్న్‌ Vs వ్యభిచారం.. ట్వీట్‌ వైరల్‌ - raj kundra old tweet on porn vs prostitution goes viral
close
Updated : 20/07/2021 19:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Raj Kundra: పోర్న్‌ Vs వ్యభిచారం.. ట్వీట్‌ వైరల్‌

న్యూదిల్లీ: అశ్లీల చిత్రాలను నిర్మించి పలు యాప్‌ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారన్న ఆరోపణలపై బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రాను ముంబయి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై గత ఫిబ్రవరిలో ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, గతంలో రాజ్‌కుంద్రా చేసిన ఒక వివాదాస్పద ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

మార్చి 29, 2012న రాజ్‌ కుంద్రా తన ట్విటర్‌ వేదికగా ‘‘పోర్న్‌ VS వ్యభిచారం. కెమెరా ముందు శృంగారం చేసినందుకు డబ్బులు చెల్లించడాన్ని ఎందుకు చట్టబద్ధం చేయకూడదు. వ్యభిచారానికి దీనికీ ఏమైనా వ్యత్యాసం ఉందా’’ అని ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేయడం అప్పట్లో  కాస్త వివాదం అయింది. అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాలు 2012లో లేకపోవడం, ఇప్పుడు అశ్లీల చిత్రాల ఆరోపణలపై రాజ్‌కుంద్రా అరెస్టు కావడంతో ఆ ట్వీట్‌ తెగ వైరల్‌ అవుతోంది. రాజ్‌కుంద్రాపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

మరోవైపు ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, ఈ కేసులో ప్రధాన కుట్రదారుగా రాజ్‌కుంద్రా కనిపిస్తున్నాడని ముంబయి పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. మరిన్ని వివరాలు సేకరించేందుకు జులై 23 తేదీ వరకూ రాజ్‌కుంద్రాను తమ కస్టడీలోనే ఉంచనున్నట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు. కాగా, తాను ఏ తప్పు చేయలేదని రాజ్‌కుంద్రా పేర్కొన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని