Cinema News: ఇదే నా శపథం: శ్రీ విష్ణు - raja raja chora teaser out now
close
Published : 18/06/2021 11:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: ఇదే నా శపథం: శ్రీ విష్ణు

ఆకట్టుకునేలా ‘రాజరాజచోర’ టీజర్‌

హైదరాబాద్‌: నటుడు శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రాజరాజచోర’. హసిత్‌ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మేఘాఆకాశ్‌ కథానాయిక. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘రాజరాజచోర’ టీజర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ఇందులో శ్రీవిష్ణు.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినని చెప్పుకునే దొంగగా కనిపించనున్నారు.

ప్రముఖ నటుడు రవిబాబు ఇందులో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించినట్లు టీజర్‌ చూస్తే తెలుస్తోంది. అలాగే.. గంగవ్వ, తమిళ నటి సునైనా ఇందులో కీలకపాత్రలు పోషించారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మరోవైపు, ‘రాజరాజచోర’ టీజర్‌ని షేర్‌ చేసిన శ్రీవిష్ణు.. ‘ ఈ పాత్రతో మీ ముందుకి రావడం నా అదృష్టం. ఈ కిరీటం ధరించినందుకు మీ పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తానన్నది నా శపథం’ అని ట్వీట్‌ చేశారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని