రాజ‘శేఖర్‌’ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది! - raja sekhar new movie first look
close
Published : 04/02/2021 12:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజ‘శేఖర్‌’ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది!

హైదరాబాద్‌: తన కొత్త సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ను సీనియర్‌ నటుడు రాజశేఖర్‌ ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఆయన‌ నేడు 59వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న 91వ చిత్రం టైటిల్‌ను ‘శేఖర్‌’గా ఖరారు చేశారు. నేటి నుంచి షూట్‌ మొదలవుతుందంటూ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో పేర్కొన్నారు. తాను కరోనా నుంచి కోలుకోవడానికి అభిమానుల ప్రార్థనలు, ప్రేమే కారణమంటూ రాజశేఖర్‌ ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత వచ్చిన మోషన్‌ పోస్టర్‌లో తీక్షణమైన చూపులతో మధ్యవయస్కుడి గెటప్‌లో  ఆయన ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్ర నేపథ్యం ఆయన యాంగ్రీ ఇమేజ్‌కు తగ్గట్టే ఉండబోతోందని అర్థమౌతోంది. ఈ చిత్రానికి లలిత్‌ దర్శకత్వం వహిస్తుండగా తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తున్నారు. రాజశేఖర్‌తో పాటు మరికొంతమంది భాగస్వామ్యంతో సినిమాను నిర్మిస్తున్నారు. అనూప్‌‌ రూబెన్స్‌ బాణీలను సమకూరుస్తున్నారు. ఆ ఫస్ట్‌లుక్‌ను మీరూ చూసేయండి!

ఇవీ చదవండి!

భర్తతో విడిపోవడం బ్రేకప్‌లా ఉంది: శ్వేతాబసుప్రసాద్‌

‘ఖిలాడి’తో అనసూయ ఆట
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని