Corona: ‘తెలంగాణ ప్రభుత్వం చేతులెత్తేసింది’ - raja singh and arvind counter fire on ktr and etela
close
Published : 23/04/2021 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: ‘తెలంగాణ ప్రభుత్వం చేతులెత్తేసింది’

ధర్మపురి ఆర్వింద్‌, రాజాసింగ్‌ ఆరోపణలు

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి ఆర్వింద్‌, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తెలిపారు. ఈ మేరకు వారు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడమే కాకుండా కేంద్రంపై అనవసర ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కొవిడ్ వ్యాప్తిపై ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఉన్నత స్థాయి సమీక్ష కూడా చేయలేదని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఎన్ని టన్నుల ఆక్సిజన్ అవసరమో కూడా ప్రభుత్వానికి తెలియదని వారు ఎద్దేవా చేశారు. కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని విమర్శించారు.

‘‘ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేవు. ఐసీయూ బెడ్స్ సరిపోవడం లేదు. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారు. కొవిడ్ చికిత్స కోసం ఆయుష్మాన్ భారత్‌ను ఎందుకు అమలు చేయడం లేదు? వ్యాక్సిన్ వేసుకోవాలని ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రచారం చేయలేదు. కేసులు, మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తోంది. కొవిడ్ కేసులు, ఆక్సిజన్, మందుల లభ్యతపై వేరే రాష్ట్రాలు కేంద్రానికి వాస్తవ సమాచారం ఇవ్వడం వల్లే వాటికి సరైన మద్దతు లభిస్తోంది. రెమ్‌డెసివిర్‌ విషయంలో కేటీఆర్ మాట్లాడింది వాస్తవామా.. లేదక ఈటల  మాట్లాడింది నిజమో స్పష్టం చేయాలి. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలి. బాధ్యతలు మర్చిపోయి సెంటిమెంటుతో బతకాలనుకుంటున్న ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదు’’ అని వారు వ్యాఖ్యలు చేశారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని