రవితేజ ‘రాజా ది గ్రేట్‌’కి సీక్వెల్‌ రానుందా? - raja the great sequel ready to roll
close
Published : 01/05/2021 13:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రవితేజ ‘రాజా ది గ్రేట్‌’కి సీక్వెల్‌ రానుందా?

ఇంటర్నెట్‌ డెస్క్: మాస్‌ మహారాజ రవితేజ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నటించిన చిత్రం ‘రాజా ది గ్రేట్‌’. 2017లో యాక్షన్‌ కామెడీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘రాజా 2 ది గ్రేట్‌’ టైటిల్‌తో రానుందని అనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి ఓ సందర్భంలో ఈ చిత్రం సీక్వెల్‌ గురించి చెబుతూ..‘‘రాజా ది గ్రేట్‌’ సినిమాకి సీక్వెల్‌  కచ్చితంగా ఉంటుంది. అయితే అది ఎప్పుడు అనేది ఇప్పుడు చెప్పలేనని’’ తెలిపారు. దర్శకుడు అనిల్‌ ఇటీవల హీరో రవితేజకి చిత్రానికి సంబంధించి స్టోరీలైన్‌ వినిపించాడట. అయితే రవితేజ మాత్రం పూర్తి స్క్రిప్ట్‌తో రావాలని దర్శకుడి కోరాడట.

అన్ని సవ్యంగా కుదిరితే ఈ ఏడాది చివరిలో కానీ, లేదా వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంలో లక్కీగా మెహరీన్‌ నటించగా, ప్రకాష్‌రాజ్‌ పోలీస్‌ అధికారిగా, రాధిక - రవితేజ తల్లి పాత్రలో నటించింది. హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి, సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌, తనికెళ్ల భరణి తదితరులు ఇతర పాత్రల్లో నటించి అలరించారు. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడి’ చిత్రం చేస్తుండగా అనిల్ రావిపూడి ‘ఎఫ్‌ 3’ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని