‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీజర్‌: రాజమౌళి ప్లాన్‌ ఏంటి? - rajamouli has huge plan about rrr teaser
close
Published : 11/01/2021 17:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీజర్‌: రాజమౌళి ప్లాన్‌ ఏంటి?

హైదరాబాద్‌: ‘ఇక నుంచి ప్రతి పండగకు మీకో సర్‌ప్రైజ్‌ తప్పకుండా ఉంటుంది’ -కరోనా తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ మొదలైన సందర్భంగా చిత్ర బృందం చెప్పిన మాట ఇది. అన్నట్లుగానే చకచకా షూటింగ్‌ ప్రారంభించి, కొమరం భీమ్‌గా నటిస్తున్న ఎన్టీఆర్‌ టీజర్‌ను విడుదల చేశారు. ఆ తర్వాత పెద్దగా సందడి కనిపించలేదు. కొత్త సంవత్సరం సందర్భంగా అభిమానులు సంబరపడేలా ఏదైనా విడుదల చేస్తారని భావించినా, ‘ఈ ఏడాది మీకు అద్భుతమైన అనుభూతిని ఇస్తాం’ అంటూ శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్‌ను మాత్రం పంచుకున్నారు. దీంతో ప్రస్తుతం అటు రామ్‌చరణ్‌, ఇటు ఎన్టీఆర్‌ అభిమానులు సంక్రాంతి బహుమతి కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వార్త తెలుగు చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది.

జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీజర్‌ను విడుదల చేసే ప్లాన్‌ చేస్తున్నారట దర్శకుడు రాజమౌళి. స్వాతంత్ర్య సంగ్రామం నాటి కథ కావడంతో ఆ రోజును విడుదల చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట.  ఇందుకోసం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్‌చరణ్‌ పరిచయ టీజర్‌కు ఎన్టీఆర్‌ వాయిస్‌ ఇవ్వగా, కొమరం భీమ్‌గా నటిస్తున్న ఎన్టీఆర్‌ పరిచయ టీజర్‌కు చెర్రీ వాయిస్‌ ఇచ్చారు. ఇక త్వరలో విడుదల చేయబోయే టీజర్‌కు అగ్ర కథానాయకుడు మెగాస్టార్‌తో వాయిస్‌ చెప్పించాలని చిత్ర బృందం యోచిస్తోందట. ఫిల్మ్‌ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వార్తపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ నుంచి ఎలాంటి సమాచారం లేదు. సంక్రాంతి సందర్భంగా ఏదైనా ఆసక్తికర విషయం చెబుతారా? అన్ని చూడాలి.

‘కేజీయఫ్‌2’తో పోలికలు మొదలు పెట్టిన అభిమానులు

యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కేజీయఫ్‌: చాప్టర్‌2’ టీజర్‌ను ఇటీవల చిత్ర బృందం విడుదల చేసింది. అతి తక్కువ సమయంలో 100మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకున్న ఈ టీజర్‌ ఒక ట్రెండ్‌ను సృష్టించింది. దీంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి విడుదల కాబోయే టీజర్‌ ‘కేజీయఫ్‌2’ టీజర్‌ను మించేలా ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ‘కేజీయఫ్‌2’లా ఒకే భాషలో టీజర్‌ను తీసుకొస్తారా? లేదా వివిధ భాషల్లో వేర్వేరుగా విడుదల చేస్తారా? అన్నది కూడా ఆసక్తికర చర్చగా మారింది? ఇప్పుడు సినీ అభిమానులంతా ఆశగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీజర్‌ కోసం చూస్తున్నారు.

ఇవీ చదవండి..!

‘నరసింహనాయుడు’ కథ అలా పుట్టింది..!

కయ్యానికి కాలుదువ్వుతున్న కంగన.. తాప్సీ

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని