‘దృశ్యం’ దర్శకుడిని ప్రశంసించిన రాజమౌళి - rajamouli sends special wishes to jeethu
close
Published : 14/03/2021 17:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘దృశ్యం’ దర్శకుడిని ప్రశంసించిన రాజమౌళి

ఇంటర్నెట్‌ డెస్క్‌: మలయాళ చిత్రాలు ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ దర్శకుడు జీతూ జోసెఫ్‌ని ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు రాజమౌళి ప్రశంసించారు. వ్యక్తిగతంగా (వాట్సాప్‌ వేదికగా) సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

‘హాయ్‌ జీతూ, నేను దర్శకుడు రాజమౌళిని. కొన్ని రోజుల క్రితం ‘దృశ్యం 2’ చిత్రం చూశా. సినిమా చూసిన తర్వాత ఆలోచలన్నీ దాని చుట్టూనే తిరిగాయి. వెంటనే మళ్లీ ఒకసారి మలయాళ ‘దృశ్యం’ చూశా.(తెలుగులో విడుదలైన వెంటనే ఆ సినిమా అప్పుడే చూశా) దర్శకత్వం, స్ర్కీన్‌ప్లే, ఎడిటింగ్‌, యాక్టింగ్‌.. ప్రతీ విభాగం అద్భుతంగా ఉంది. ముఖ్యంగా రచనా విధానం గొప్పగా ఉంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన కథ ఇది. ‘దృశ్యం’ ఒక మాస్టర్‌పీస్‌. అదే ఉత్కంఠతో ‘దృశ్యం 2’ని తీసుకురావడం గొప్ప విషయం. మీ నుంచి మరికొన్ని మాస్టర్‌పీస్‌ చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను’ అని జీతూకి సందేశం పంపించారు రాజమౌళి. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంటూ రాజమౌళికి కృతజ్ఞతలు తెలియజేశారు జీతూ.

మోహన్‌ లాల్‌, మీనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఫిబ్రవరి 19న విడుదలైంది. ఇదే సినిమాను తెలుగులో వెంకటేశ్‌ కథానాయకుడుగా తెరకెక్కిస్తున్నారు జీతూ జోసెఫ్‌. ‘దృశ్యం’ రీమేక్‌ అయిన అన్ని భాషల్లోనూ ఘన విజయం అందుకుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని