అపోలో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్‌ - rajanikanth admit apollo hospatal
close
Updated : 25/12/2020 13:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అపోలో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్‌

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు రజనీకాంత్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ‘‘రక్తపోటులో హెచ్చుతగ్గుల కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారు. బీపీని అదుపు చేసేందుకు చికిత్స అందిస్తున్నాం. ఈ సమస్య తప్ప ఇతర ఇబ్బందులు ఏమీ లేవు. రక్తపోటు అదుపులోకి రాగానే రజనీకాంత్‌ను డిశ్ఛార్జి చేస్తాం. ఈ నెల 22న నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చింది’’ అని అపోలో ఆసుపత్రి వైద్యులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

రజనీకాంత్‌ తన తదుపరి చిత్రం 'అన్నాత్తే' చిత్రీకరణ  కోసం ఇటీవల హైదరాబాద్‌కు వచ్చారు. అయితే చిత్రబృందంలో కొందరు సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చిత్రీకరణ నిలిపేశారు. ఈ క్రమంలోనే డిసెంబర్‌ 22న ఆయనకు కొవిడ్‌-19 పరీక్ష చేయగా నెగిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయన గత కొన్నిరోజులుగా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని