IPL 2021: బాలీవుడ్‌ పాటకు రాజస్థాన్‌ చిందులు - rajasthan royals posted a hilarious video song from bollywood featuring their players after ipl 2021 resume
close
Updated : 29/05/2021 19:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPL 2021: బాలీవుడ్‌ పాటకు రాజస్థాన్‌ చిందులు

టోర్నీ తిరిగి కొనసాగడంపై ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల సంతోషం

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల భారత్‌లో నిర్వహించిన ఐపీఎల్‌ 14వ సీజన్‌ అర్థాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. బయోబుడగలోని పలువురు ఆటగాళ్లు కరోనా వైరస్‌బారిన పడటంతో ఆ టోర్నీని నిరవధికంగా వాయిదా వేశారు. దాంతో ఎంతో మంది క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశచెందారు. అయితే, తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ నేతృత్వంలో జరిగిన స్పెషల్‌ జనరల్‌ మీటింగ్‌లో ఆ టోర్నీని తిరిగి నిర్వహించడంపై నిర్ణయం తీసుకున్నారు. టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌ పర్యటన అనంతరం సెప్టెంబర్‌లో గతేడాదిలాగే యూఏఈలోనే ఈసారి మిగిలిన మ్యాచ్‌లు నిర్వహించాలని తీర్మానించారు.

ఆ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించడంతో అటు అభిమానులు, ఇటు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు సంతోషం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తమ ఆనందాన్ని పంచుకున్నారు. అయితే, రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంఛైజీ చేసిన ఓ పోస్టు మాత్రం నెటిజెన్లను విపరీతంగా ఆకట్టుకుంది. అది వినూత్నంగా ఉండటమే కాకుండా అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని కలిగిచింది. ‘హే బేబి’ అనే బాలీవుడ్‌ సినిమాలోని ‘మస్త్‌ కలందర్‌’ పాటకు తమ ఆటగాళ్ల ముఖాలు జోడించి రాజస్థాన్‌ ట్వీట్‌ చేసింది. అందులో అక్షయ్‌ కుమార్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్‌, షారుఖ్‌ ఖాన్‌ లాంటి హీరోలు నటించగా వారి ప్రతిరూపాలుగా కెప్టెన్‌ సంజూ శాంసన్‌, రాహుల్‌ తెవాతియా, జోస్‌ బట్లర్‌ లాంటి ఆటగాళ్లతో మార్ఫింగ్‌ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. మీరూ ఓ లుక్కేసి ఐపీఎల్‌ మజాను ఆస్వాదించండి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని