Annaatthe: అనుకున్న తేదీకే రానున్న రజనీ - rajinikanth annaatthe release date fix directed by siva
close
Published : 02/07/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Annaatthe: అనుకున్న తేదీకే రానున్న రజనీ

ఇంటర్నెట్‌ డెస్క్: కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ లాక్‌డౌన్‌ కారణంగా సినిమా చిత్రీకరణలు ఎక్కడివక్కడే నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దాంతో ఆయా సినిమాలు అనుకున్న సమయానికి విడుదలవుతాయా, లేదా? అనే ప్రశ్న అందరిలోనూ నెలకొంది. రజనీ నటిస్తోన్న ‘అన్నాత్తే’ విషయంలోనూ ఇదే సందేహం. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుని దీపావళి కానుకగా నవంబరు 4న విడుదల చేయనున్నారని ఎప్పటి నుంచో కోలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తోంది. మరి రజనీ అనుకున్న తేదీనే వస్తారా? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చేసింది చిత్ర బృందం. ఈ చిత్రాన్ని నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. ‘దీపావళికి అన్నాత్తే.. సిద్ధమా’ అంటూ విడుదల తేదీతో కూడిన ఓ పోస్టర్‌ని అభిమానులతో పంచుకుంది. ఇందులో రజనీ వెనక్కి తిరిగి ఉంటారు. ఫస్ట్‌లుక్‌ త్వరలోనే విడుదల కానుంది. కళానిధి సమర్పణలో సన్‌ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తోంది. కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ,  ప్రకాష్ రాజ్, రోబో శంకర్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డి.ఇమ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు. 

 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని