రజనీ కోసం ‘అన్నాత్తె’ సెట్‌లోనే వైద్యులు   - rajinikanth joins annatthe sets along with doctors for medical emergency
close
Published : 19/03/2021 02:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రజనీ కోసం ‘అన్నాత్తె’ సెట్‌లోనే వైద్యులు 

ఇంటర్నెట్‌ డెస్క్‌: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కొంతకాలం క్రితం అనారోగ్యానికి గురికావడంతో ‘అన్నాత్తె’ చిత్రీకరణ నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాగా.. ఆ సినిమా షూటింగ్‌ గురించి కొన్ని వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. షూటింగ్‌ సందర్భంగా గత డిసెంబర్‌లో రజనీకాంత్‌ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రిలో చేరిన ఆయనకు రక్తపోటులో హెచ్చుతగ్గులు వచ్చాయి. ఈక్రమంలో ఆయనకు చికిత్స చేసిన వైద్యులు రజనీకాంత్‌కు కొన్ని నెలల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. కాగా.. ఆయన చెన్నైలో జరుగుతున్న అన్నాత్తె షూటింగ్‌లో పాల్గొంటున్నారట. ఆయనతో పాటే వైద్యులు కూడా సినిమా సెట్లోనే అందుబాటులో ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. దీనికి సంబంధించి చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఈ సినిమా సిరుతయి శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రకాశ్‌రాజ్‌, సురేశ్‌, ఖుష్బూ సుందర్‌, మీన, నయనతార, కీర్తి సురేశ్‌ కూడా కీలక పాత్రలు పోషించనున్నారు. ఇమ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో జగపతిబాబు ఒక కీలకపాత్రలో కనిపించనున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించించింది. ఈ సినిమాను నవంబర్‌ 4న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని