‘అన్నాత్తే’కోసం హైదరాబాద్‌కు రజనీ - rajinikanth to resume shooting for annaatthe in hyderabad
close
Updated : 08/04/2021 18:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అన్నాత్తే’కోసం హైదరాబాద్‌కు రజనీ

ఇంటర్నెట్‌ డెస్క్: రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకుడు. గత డిసెంబరులో రజనీకాంత్‌ అస్వస్థతకు గురవడంతో షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. నాలుగు నెలల అనంతరం రజనీకాంత్ ఈ చిత్ర షూటింగ్‌ కోసం తాజాగా చెన్నై నుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు. గత నెలలో చెన్నై శివార్లలో ఆ సినిమా ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇందులో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. కళానిధి సమర్పణలో సన్‌ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రంలో నయనతార కథానాయిక. కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ,  ప్రకాష్ రాజ్, జాకీ ష్రాఫ్, రోబో శంకర్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. డి.ఇమ్మాన్‌ సంగీత స్వరాలు అందిస్తున్నారు. వెట్రి పళని స్వామి సినిమాటోగ్రాఫర్‌. ఎడిటర్‌గా రూబెన్‌ వ్యవహరిస్తున్నారు. నవంబర్‌ 4న దీపావళి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇటీవల రజనీకాంత్‌కి 2020కి గానూ దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును భారతప్రభుత్వం ప్రకటించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని