రాజ్‌కుమార్‌ రావ్‌ as విశ్వక్‌ సేన్‌ - rajkumar will act in hit the movie hindi reamke
close
Published : 16/07/2020 03:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజ్‌కుమార్‌ రావ్‌ as విశ్వక్‌ సేన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: మర్డర్‌ మిస్టరీని ఛేదించడం.. కిడ్నాప్‌ కేసులను ట్రేస్‌ చేయడం అంటే బాలీవుడ్‌కి చాలా ఇష్టం. స్టార్‌ హీరోల నుంచి కొత్త కుర్రాళ్ల వరకు అందరూ ఇలాంటి థ్రిల్లర్ సినిమాలంటే సై అంటున్నారు. ఇది ఏ రేంజీలో ఉందంటే... వాళ్ల దగ్గర ఉన్న కథలు కాకుండా... పక్క భాషల వైపు కూడా చూస్తుంటారు. అలా బాలీవుడ్‌ ఎంచుకున్న కొత్త తెలుగు కథ ‘హిట్‌’. ఈ ఏడాది కరోనా - లాక్‌డౌన్‌ ముందు విడుదలై మంచి విజయం అందుకున్న ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌కి వెళ్తోంది. 

విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న రాజ్‌కుమార్‌ రావ్‌ ప్రధాన పాత్రలో ‘హిట్‌’ సినిమాను బాలీవుడ్‌కి తీసుకెళ్లబోతున్నారు. తెలుగులో విశ్వక్‌సేన్‌ ఆ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ప్రియురాలి కిడ్నాప్‌తో మొదలయ్యే కథ... అనే మలుపు తిరిగి ఎలా ముగిసింది... హీరో ఎలా ముగించాడు అనేదే కథ. ఇందులో విశ్వక్‌ సేన్‌ సీరియస్‌గా కనిపిస్తూనే... తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ పాత్రలో రాజ్‌కుమార్‌ రావ్‌ ఎలా చేస్తాడో చూడాలి. అయినా ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టినపిండి అని అతని పాత సినిమాలు చూస్తే తెలిసిపోతుంది. 

తెలుగులో ‘హిట్‌’ను తెరకెక్కించిన శైలేష్ కొలను హిందీ రీమేక్ కి కూడా దర్శకత్వం వహిస్తారు. ప్రముఖ నిర్మాత  దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయనతోపాటు మరో నిర్మాతగా కుల్దీప్ రాఠోడ్ వ్యవహరిస్తారు. ఈ మేరకు దిల్‌ రాజు నిర్మాణ సంస్థ అధికారికంగా ట్వీట్‌ చేసింది. వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. మరి అక్కడ సినిమాకు ఏం పేరు పెడతారు..  మిగిలిన చిత్రబృందం వివరాలు త్వరలో తెలుస్తాయి.

 Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని