Corona: 10 రోజుల్లో ఎంపీ.. ఇద్దరు కుమారులు మృతి - rajyasabha mp and two sons died ten days apart with covid
close
Published : 21/05/2021 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: 10 రోజుల్లో ఎంపీ.. ఇద్దరు కుమారులు మృతి

భువనేశ్వర్‌: ప్రముఖ శిల్పి, రాజ్యసభ సభ్యుడు, పద్మవిభూషణ్‌ గ్రహీత రఘునాథ్‌ మహపాత్ర ఇంట్లో కరోనా మహమ్మారి తీవ్ర విషాదాన్ని నింపింది. పది రోజుల వ్యవధిలో ఎంపీ రఘునాథ్‌, ఆయన ఇద్దరు కుమారులు వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. 

కరోనా సోకడంతో ఏప్రిల్‌ 22న రఘునాథ్(78) భువనేశ్వర్‌లోని ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం క్షీణించి మే 9న తుదిశ్వాస విడిచారు.  ఆయన పెద్ద కుమారుడు జషోబంత, మరో కుమారుడు ప్రశాంత  కూడా కొవిడ్‌ బారినపడ్డారు. వీరిని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ప్రశాంత్‌ బుధవారం కన్నుమూయగా.. పెద్ద కుమారుడు జషోబంత నేడు ప్రాణాలు కోల్పోయారు. 

తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని 8ఏళ్ల వయసులోనే శిల్పిగా మారిన రఘునాథ్‌  2018లో రాజ్యసభకు నామినేట్‌ ఎంపీగా ఎంపికయ్యారు. ఆయన ప్రతిభకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం 1975లో పద్మశ్రీ, 2001 పద్మభూషణ్‌, 2013లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది. ఆయన కుమారుడు ప్రశాంత్‌ ఒడిశా రంజీ ట్రోఫీ క్రికెట్‌ జట్టుకు సారథిగా బాధ్యతలు నిర్వహించారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని