కొత్త జంట.. సరికొత్త ప్రయాణం - rakul preet singh new movie doctor g
close
Published : 06/04/2021 13:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్త జంట.. సరికొత్త ప్రయాణం

ముంబయి: దక్షిణాది.. ఉత్తరాది అని తేడా లేకుండా వరుస చిత్రాలతో జోరు చూపిస్తోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు అరడజనుకు పైగా    సినిమాలున్నాయి. ఇప్పుడీ జాబితాలో ‘డాక్టర్‌ జి’ అనే మరో బాలీవుడ్‌ చిత్రం వచ్చి చేరింది. ఆయుష్మాన్‌ ఖురానా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది.  అనుభూతి కశ్యప్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జంగ్లీ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ వచ్చే నెల నుంచి మొదలు కాబోతున్నట్లు రకుల్, ఆయుష్మాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ చదవడం ప్రారంభించినట్లు ఓ ఫొటో పంచుకున్నారు.

ఓ వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆయుష్మాన్‌.. ఉదయ్‌ గుప్తా అనే  గైనకాలజిస్ట్‌ వైద్య విద్యార్థిగా కనిపించనున్నారు.   ఆయనకు జూనియర్‌గా ఫాతిమా అనే వైద్య విద్యార్థినిగా రకుల్‌ దర్శనమివ్వనుంది. త్వరలో ఈ చిత్ర  విడుదల తేదీ ప్రకటించనున్నారు. ప్రస్తుతం రకుల్‌ బాలీవుడ్‌లో ‘థ్యాంక్‌ గాడ్‌’, ‘మేడే’, ‘అటాక్‌’ తదితర చిత్రాల్లో నటిస్తోంది. ఆమె తెలుగులో వైష్ణవ్‌ తేజ్‌కు జోడీగా క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించింది. ఇది త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని