దానికోసం.. ఎంతైనా కష్టపడొచ్చు - rakul preetsingh comments on stardom
close
Published : 15/05/2021 15:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దానికోసం.. ఎంతైనా కష్టపడొచ్చు

‘‘మీ ఫలానా సినిమా చాలా బాగుంటుంది...మీరు చాలా బాగా నటించారు’అంటూ అభిమానులు ఆత్మీయంగా నవ్వుతూ పలకరించినప్పుడు ఉండే ఆనందానికి హద్దే ఉండదు. ఆ నవ్వు కోసం ఎంతైనా కష్టపడాలి అనిపిస్తుంది’’అంటోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. దక్షిణాదిలో అగ్ర కథానాయికగా కొనసాగుతూనే బాలీవుడ్‌లో అడుగుపెట్టిన రకుల్‌ అక్కడా సత్తా చాటుతోంది. ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టి ఏడేళ్లు అయ్యింది. చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది రకుల్‌. ‘‘నా స్టార్‌డమ్‌ ఏమైపోతుందో అనే భయం లేకుండా ముందుకెళ్లడమే నా విజయానికి ప్రధాన కారణం. ఈ పరిశ్రమలోకి అడుగుపెట్టే నాటికి నాకు ఎలాంటి పేరు లేదు. అదృష్టవశాత్తు చాలా మందికి దొరకని గొప్ప అవకాశాలు దక్కాయి. వాటితో నా కలను నెరవేర్చుకున్నాను. ప్రేక్షకులు నాపై చూపించే ప్రేమే కొత్త పాత్రల వైపు అడుగులేసేలా చేస్తుంది’’అని చెప్పింది రకుల్‌. ఆమె నటించిన ‘సర్దార్‌ కా గ్రాండ్‌సన్‌’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. అమితాబ్‌బచ్చన్, అజయ్‌దేవ్‌గణ్‌తో కలిసి ‘మేడే’, జాన్‌ అబ్రహం ‘ఎటాక్‌’, ఆయుష్మాన్‌ ఖురానా ‘డాక్టర్‌ జి’, అజయ్‌దేవ్‌గణ్‌తో ‘థ్యాంక్‌ గాడ్‌’ ఇలా భారీ బాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తోంది రకుల్‌.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని