RRR: పిట్టగోడపై జక్కన్న జట్టు సరదా ముచ్చట్లు.. ఎన్టీఆర్‌ ముఖంపై గాయం! - ram charan and tarak chilling in between shots rrr movie
close
Published : 08/08/2021 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RRR: పిట్టగోడపై జక్కన్న జట్టు సరదా ముచ్చట్లు.. ఎన్టీఆర్‌ ముఖంపై గాయం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలకు సమయం దగ్గరపడుతోంది. సినిమా ఎప్పుడు విడుదలవుతుందా? ఎప్పుడు థియేటర్‌కు వెళ్లి ఈలలు వేసి గోల చేద్దామా? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ మాత్రం హాయిగా సినిమా సెట్లో కాలక్షేపం చేస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో షూటింగ్‌కు మధ్యలో దొరికిన కాస్త విరామ సమయంలో తన హీరోలతో జక్కన్న సరదాగా సమయం గడిపారు. చరణ్‌, తారక్‌ పిట్టగోడ మీద కూర్చొని కబుర్లు చెప్పుకొంటూ ఉండగా.. ఆ దృశ్యాలను రాజమౌళి ఒక డమ్మీ కెమెరాతో చిత్రీకరిస్తున్నట్లు కనిపించారు. ఈ వీడియోను ఆర్ఆర్‌ఆర్‌ టీమ్‌ సోషల్‌ మీడియాలో పంచుకుంది. అయితే.. ఆ వీడియోలో ఎన్టీఆర్‌ మొహంపై గాయం అయినట్లు కనిపిస్తోంది. దీంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. బహుశా షూటింగ్‌లో భాగంగా చిన్న గాయమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్‌ఆర్ఆర్‌ టీమ్‌ ఉక్రెయిన్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సుమారు రూ.450కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాతో మరోసారి కీరవాణి రాజమౌళితో కలిసి పనిచేస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్‌ 13 ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఈ సినిమా విడుదల తేదీ విషయంలో మరో నిర్ణయం తీసుకోవాలని చిత్రబృందం యోచిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. ఇటీవల విడుదలైన ‘దోస్తీ’ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకెళుతోంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని