Disney Hotstar: డిస్నీ+ హాట్‌స్టార్‌ ప్రచారకర్తగా రామ్‌చరణ్‌.. పారితోషికం ఎంతంటే..?  - ram charan is paid to be disney plus hotstar brand ambassador is this much
close
Updated : 21/09/2021 08:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Disney Hotstar: డిస్నీ+ హాట్‌స్టార్‌ ప్రచారకర్తగా రామ్‌చరణ్‌.. పారితోషికం ఎంతంటే..? 

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి విలయతాండవంతో పలురంగాలు కూదేలు అయ్యాయి. అందులో సినిమా రంగం కూడా ఒకటి. ప్రభుత్వాల కఠిన ఆంక్షలతో పలు చిత్రాల షూటింగ్‌లు మధ్యలోనే ఆగిపోయాయి. ఇక నిర్మాంణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చిత్రాలు థియేటర్లు తెరుచుకోకపోవడంతో విడుదలకు నోచుకోలేకపోయాయి. ఇక ఇదే అదనుగా ఓటీటీలు పలు చిత్రాలను తమ వేదికగా విడుదల చేస్తూ దూసుకెళ్తున్నాయి. దీంతో చిన్నచిత్రాల నుంచి మొదలుకొని భారీ బడ్జెట్‌ చిత్రాలను సైతం ఓటీటీల్లో విడుదల చేసేందుకు చిత్రబృందాలు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటీటీలు సామాన్యులను సైతం ఆకట్టుకునేందుకు ఆయా ప్రాంతాల్లోని స్టార్‌ హీరోలను తమ బ్రాండ్‌ ప్రచారకర్తలుగా నియమించుకుంటున్నాయి.  

ఇక రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, శంకర్‌ దర్శకత్వంలో ‘ఆర్‌సీ15’తో పాన్‌ ఇండియా చిత్రాలు చేస్తూ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ దూసుకుపోతున్నారు. తాజాగా ప్రముఖ ఓటీటీ వేదిక ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా రామ్‌చరణ్‌ తేజ్‌ను ఎంచుకుంది. ఈ ఒప్పందానికి చెర్రీకి భారీగానే ముట్టజెప్పినట్లు సినీ ఇండస్ట్రీలోని పలువురు పేర్కొంటున్నారు. బ్రాండ్‌ అంబాసీడర్‌గా చెర్రీ ఏటా రూ.5-7 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. డిస్నీ+ హాట్‌స్టార్‌ రామ్‌చరణ్‌తో కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. టాలీవుడ్‌లో ఇంత పెద్ద ఒప్పందం కుదరడం కూడా ఇదే తొలిసారని పేర్కొంటున్నారు. మరోవైపు తమ ఓటీటీ వేదికను చెర్రీ ఓ స్థాయికి తీసుకెళతాడని డిస్నీ+ హాట్‌స్టార్‌ బలంగా నమ్ముతోంది. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ ఇన్‌స్టాలో ఓ వీడియోతో కూడిన పోస్టు విడుదల చేశారు. ‘వినోదమే ఇక్కడ మన సొంతం! బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు, తెలుగు హాట్‌స్టార్‌ స్పెషల్స్‌, స్పోర్ట్స్‌, ఇంకా చాలా ఉన్నాయి. మన వినోద విశ్వం డిస్నీ+ హాట్‌స్టార్‌కు స్వాగతం పలకండి’ అంటూ చెర్రీ రాసుకొచ్చాడు.   

 



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని